విద్యార్థినులతో ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన
ABN, Publish Date - Mar 05 , 2024 | 12:36 AM
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు దా డి చేశారు.
విద్యార్థినులతో ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన
పాఠశాలలో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు
ఇద్దరు ఉపాధ్యాయులపై దాడి
నల్లగొండ/నల్లగొండటౌన, మార్చి 4: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు దా డి చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ పట్టణంలో గల డైట్ ప్రా థమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు 171మంది విద్యనభ్యసిస్తున్నారు. తొమ్మిది మంది సిబ్బంది కాగా ప్రధానోపాధ్యాయుడు పోలా వెంకటయ్య, ఉపాధ్యాయుడు పి.శ్యాంసుందర్, ఏడుగురు ఉపాధ్యాయినులు ఉన్నారు. తరగతి గది నుంచి విద్యార్థినులు బ యటకు వచ్చిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు వెంకట య్య, ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బాలికల శరీరంపై ఎక్కడ పడితే అక్కడ తడుము తూ చేతులు వేస్తుండటం, బుగ్గలపై ముద్దులు పెడుతుండటం తో ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడ్డారు. బాలికలు శనివారం పాఠశాలలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలికి తమ స మస్యను వివరించగా, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థినుల తల్లిదండ్రు లు సోమవారం డైట్ ప్రాథమిక పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఓ దశలో సదరు ఉపాధ్యాయులపై దాడికి పాల్పడ్డా రు. ఆందోళన తీవ్రతరం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లగొండ ఎంఈవో అరుంధతి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహులు వచ్చి పాఠశాలలోని విద్యార్థినులను, సహచర ఉ పాధ్యాయులను విచారించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రు ల నుంచి ఫిర్యాదు తీసుకున్న టూటౌన పోలీసులు పోల వెంకట య్య, శ్యాంసుందర్‌ను పోలీ్‌సస్టేషనకు తరలించారు. ఈ ఘటన పై డీఈవో బొల్లారం భిక్షపతి స్పందిస్తూ ప్రస్తుతం విచారణ జ రుగుతున్నందున స్పష్టత వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ హరిచందనకు నివేదిక అందజేస్తామని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులు విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Updated Date - Mar 05 , 2024 | 12:36 AM