చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
ABN, Publish Date - Mar 03 , 2024 | 11:38 PM
జహీరాబాద్, మార్చి 3: హైదరాబాద్‌లోని మాదన్నపేట పరిఽధిలో నుష్రత్‌షాజాహాన్‌బేగం అనే మహిళ 8 నెలల చిన్నారిని కిడ్నా్‌పచేసి శనివారం రాత్రి మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో జహీరాబాద్‌లో పట్టుకున్నామని పట్టణ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
కిడ్నాపర్‌ను అరెస్టు చేసి పాపను రక్షించిన పోలీసులు
జహీరాబాద్, మార్చి 3: హైదరాబాద్‌లోని మాదన్నపేట పరిఽధిలో నుష్రత్‌షాజాహాన్‌బేగం అనే మహిళ 8 నెలల చిన్నారిని కిడ్నా్‌పచేసి శనివారం రాత్రి మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో జహీరాబాద్‌లో పట్టుకున్నామని పట్టణ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదన్నపేట ప్రాంతానికి చెందిన అమర్యాసిద్దిఖ్(8 నెలలు)ను నుష్రత్‌షాజాహాన్‌బేగం అనే మహిళ హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు కర్ణాటక బస్సులో తీసుకుపోతున్నది. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు తమకు సమాచారం ఇవ్వడంతో కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన బస్సులను తనిఖీలు చేయగా నుష్రత్‌షాజాహాన్‌బేగం పాపతో కలిసి పట్టుబడిందన్నారు. ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు, మాదన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వెంటనే వారు పాప తల్లిదండ్రులతో వచ్చారని ఆయన చెప్పారు. ఈ మేరకు పాపను, నేరస్థురాలిని మాదన్నపేట పోలీసులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 11:38 PM