పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:00 AM
రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదగౌడ్
వెల్దుర్తి, మార్చి 2: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు యాదగౌడ్ కోరారు. శనివారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పిలుపుమేరకు వెల్దుర్తిలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మైసయ్యతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి పాటుపడుతామని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. పంటలకు బీమా పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ పంట నష్టం జరిగిన 30రోజుల్లోనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి షూరిటీ లేకుండా రూ.ఐదు లక్షల వరకు తక్కువ వడ్డీకి రుణసౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా కోశాధికారి వెంకటేశం పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:00 AM