ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెట్టు కింద చదువులు

ABN, Publish Date - Feb 22 , 2024 | 11:20 PM

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

బెటాలియన్‌ పాఠశాలలో చెట్టుకింద కొనసాగుతున్న తరగతి

- తరగతి గదులు సరిపోక విద్యార్థుల అవస్థలు

- బెటాలియన్‌లో స్థల సేకరణ సమస్య

- వెనక్కి మళ్లిన నిధులు

ఎర్రవల్లి, ఫిబ్రవరి 22 : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాల లకు కొత్త భవనాలు, అదనపు గదులు, ప్రహరీల నిర్మాణం చేపడుతోంది. అలాగే ఆధునిక విద్యా సామగ్రిని సమకూర్చుతోంది. కానీ ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌ అవరణలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పాఠశాలలో ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. 230 మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. కానీ తరగతులకు సరిపడినన్ని గదులు లేక పోవడం సమస్యగా మారింది. దీంతో పాఠశాలలో కొన్ని తరగతులను చెట్ల కిందే నిర్వహిస్తున్నారు. ఐదు తరగతులకు నాలుగు గదులే ఉండటంతో ప్రతీ రోజు ఏదో ఒక తరగతిని చెట్టు కిందే నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఎర్రవల్లి పదో బెటాలియన్‌ పరిధిలో ఉన్న ఈ పాఠశాలలో స్థానికులతో పాటు, మండల పరిసరాల్లోని ఎనిమిది గ్రామాల నుంచి విద్యార్థులు బస్సులో వచ్చి చదువుకుంటున్నారు. పాఠశాల పోలీసు పటాలంలో ఉండటం, మెరుగైన విద్యాబోధన కొనసాగుతుండటంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ సరైన వసతులు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

వచ్చిన నిధులు వెనక్కి.

పదో బెటాలియన్‌లో ఉన్న ఈ పాఠశాలను ఆధునికీకరించి, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు మన ఊరు - మన బడి పథకం ద్వారా రూ.48 లక్షలు మంజూరయ్యాయి. రూ.30 లక్షల కన్నా ఎక్కువ నిధులతో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం టెండర్‌ ద్వారా కేటాయిస్తుంది. కానీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వచ్చిన నిధులు వెనక్కి మళ్లినట్లు సమాచారం. దీనికి తోడు పాఠశాల బెటాలియన్‌ పరిధిలో ఉండటంతో, ఏ పనులు చేపట్టాలన్నా ఉన్నతాధికారుల ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక్కడ భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరవగా, పనులను ప్రారంభించారు. కానీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చాకే నిర్మాణం కొనసాగించాలని స్థానిక అధికారులు చెప్పడంతో మధ్యలోనే నిలిచిపోయింది.

తరగతి గదులు నిర్మించాలి

వరలక్ష్మి, 10వ తరగతి : పాఠశాలలో విద్యాబోధన చాలా బాగుంది. మంచి వాతావరణంలో పాఠశాల కొనసాగుతోంది. అందుకే చుట్టు పక్క గ్రామాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. కానీ తరగతి గదులు సరిపోను లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి తరగతి గదులను నిర్మించాలి.

స్థల సేకరణే సమస్య

మహబూబ్‌ పాషా, ప్రధానోపాధ్యాయుడు : పాఠశాల బెటాలియన్‌ అవరణలో ఉంది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కూడా వచ్చాయి. కానీ కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. అంతే కాకుండా ఏ పనులు చేపట్టాలన్నా బెటాలియన్‌ ఉన్నతాధికారులు స్థలానికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

Updated Date - Feb 22 , 2024 | 11:20 PM

Advertising
Advertising