ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పల్స్‌ పోలియో విజయవంతం

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:21 PM

జిల్లాలో నిర్వహిం చిన పల్స్‌ పోలి యో 95.3శాతం నమోదైనట్లు జి ల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధా కర్‌లాల్‌ ఆదివా రం తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేస్తున్న డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌

- జిల్లాలో 95.3శాతం నమోదైన పల్స్‌ పోలియో

కందనూలు, మార్చి 3 : జిల్లాలో నిర్వహిం చిన పల్స్‌ పోలి యో 95.3శాతం నమోదైనట్లు జి ల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుధా కర్‌లాల్‌ ఆదివా రం తెలిపారు. ఇక ఎవరైనా చి న్నారులు మిగిలి ఉంటే సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరిం చాలని ఆయన కోరారు.

కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌వో

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో, ఈదమ్మగుడి దగ్గర ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ల్లో ఆదివారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే సుధాకర్‌లాల్‌ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0-5 సంవత్సరాలలోపు చిన్నారులం దరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. బస్టాండ్‌ పరిధిలో ప్రతీ ఒక్క బస్సును క్షుణ్ణంగా పరిశీలించి 0-5సంవత్సరాలలోపు ఉన్న వారిని గుర్తించి పోలియో చుక్క లు వేయించాలని సూచించారు. హైరిస్కు ఏరియాలైన ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, సంచార జాతుల నివాసాల్లో చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొబైల్‌ టీమ్‌లు వందశాతం వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ రవికుమార్‌, ప్రోగ్రామ్‌ అధికారి కృష్ణమోహన్‌, మాస్‌ మీడియా అధికారి నరసింహ, రెడ్‌క్రాస్‌ సెక్రటరీ రమేష్‌రెడ్డి, జిల్లా వ్యాక్సిన్‌ స్టోర్స్‌ మేనేజర్‌ కుమార్‌, పర్యవేక్షణ అధికారి కేశవులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:21 PM

Advertising
Advertising