ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహోత్సవాలను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:15 PM

అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అలంపూర్‌లో మహా శివరాత్రి, మహా కుంభాభిషేకం మహోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌, హాజరైన అధికారులు

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- అలంపూర్‌లో శివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష

- భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం

గద్వాల న్యూటౌన్‌, మార్చి 4 : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి అలంపూర్‌లో మహా శివరాత్రి, మహా కుంభాభిషేకం మహోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మాత్సవాల నిర్వహణపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో దేవాదాయ, మునిసిపల్‌, పోలీసు, విద్యుత్‌, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాలు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లా డారు. మహా శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు అలంపూర్‌ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాకుంభాషేకం ఉత్సవాలను సోమవారం నుంచి ఎనిమిదవ తేదీ వరకు కొన సాగుతాయని తెలిపారు. ఎనిమిదవ తేదీన మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే మహా కుంభాభిషేకాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు. పార్కింగ్‌, నిరంతర విద్యుత్‌, వైద్యసదుపాయాలన కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుంగభద్ర పుష్కరఘాట్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే అలంపూర్‌ ఎస్‌ఐ, సీఐలను సంప్రదించాలని, అత్యవసర సేవలం దించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. తుంగభద్ర పుష్కరఘాట్‌ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచా లని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు. 102, 108 వాహనాలను దేవాలయం వద్ద సిద్ధంగా ఉంచాల న్నారు. చౌరస్తా నుంచి అలంపూర్‌ వరకు మూడు బస్సులు, కర్నూల్‌ నుంచి అలంపూర్‌ వరకు ఏడు అదనపు బస్సులను నడిపించాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. క్షేత్రంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయించాలని మునిసిపల్‌ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో ఈవో పురందర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశకళ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:15 PM

Advertising
Advertising