రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:05 PM
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృ తి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చారకొండ మండలం లో చోటు చేసుకొంది.
చారకొండ, మార్చి 1: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృ తి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చారకొండ మండలం లో చోటు చేసుకొంది. ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మెడమోని నారమ్మ (60) అదే గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద జడ్చర్ల-కోదాడ రాహదారి దాడుతుండగా కల్వకుర్తి నుం చి చారకొండకు వస్తున్న కారు ఢీ కొట్టడంతో నారమ్మ అక్క డికక్కడే మృతి చెందింది. నారమ్మకు కొడుకు కొండల్ ఉన్నా డు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
Updated Date - Mar 01 , 2024 | 11:05 PM