మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు: కిషన్‌రెడ్డి
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:21 AM
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో రూ.6 వేల కోట్లతో ఎన్‌టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును మార్చి 4న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా మోదీ వర్చువల్ విధానంలో ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. మార్చి 5న హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (కారో) సంస్థను ప్రధాని ప్రారంభించనున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 09:57 AM