ఫెడరల్ ఫ్రంట్‌కు కేసీఆర్ కుట్ర
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:08 AM
ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పేరిట జరిగే కుట్రలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌నే కాక.. కేరళలో ఆయనకు సహకరిస్తున్న శక్తులను ఓడించాలని
ఇండియా కూటమి బలహీనానికి ఆయన ఎత్తులు
వచ్చే ఎన్నికలు ప్రధాని మోదీని ఓడించే యుద్ధం..
కాంగ్రె్‌సతోనే దేశంలో లౌకిక, ప్రజాస్వామిక పాలన
తిరువనంతపురం సమరాగ్ని సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తిరువనంతపురం, ఫిబ్రవరి 29: ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పేరిట జరిగే కుట్రలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌నే కాక.. కేరళలో ఆయనకు సహకరిస్తున్న శక్తులను ఓడించాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన నిరంకుశ, అవినీతిమయ విధానాలు వామపక్ష భావజాలాన్ని కలుషితం చేశాయన్నారు. తిరువనంతపురం సమరాగ్ని సభలో గురువారం సీఎం రేవంత్ మాట్లాడారు. మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాబోయేవి లోక్‌సభ ఎన్నికలు కావని.. మోదీని ఓడిచేందుకు జరుగుతున్న యుద్ధం అని, దేశమంతా మోదీపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఇండియా కూటమిని గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు బలం చేకూరుతుందని రేవంత్ పేర్కొన్నారు. ఈ విలువలను బీజేపీ తుంగలో తొక్కిందని.. అవినీతిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
Updated Date - Mar 01 , 2024 | 04:09 AM