ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘చేనేత’ ఎన్నికలు ఎప్పుడో?

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:40 AM

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చేనేతకు ఖండాంతర ఖ్యాతిని నేతన్నలు అందిస్తున్నా ఎన్నికల కోసం నేత కార్మికులకు నిరీక్షణే మిగులుతోంది.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చేనేతకు ఖండాంతర ఖ్యాతిని నేతన్నలు అందిస్తున్నా ఎన్నికల కోసం నేత కార్మికులకు నిరీక్షణే మిగులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత స్ఫూర్తిని జాతీయ దినోత్సవాల వేళ ఆర్భాటంగా చాటుతున్నారు. ఎంతో హంగామాగా వేడుకలు నిర్వహిస్తున్నా ఆదర్శప్రాయంగా నిలిచిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించక ఐదేండ్లు గడిచిపోయింది. గత ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 12వ సారి ఉత్తర్వులు ఇచ్చిన ఇన్‌చార్జి పాలన ముగిసిపోయింది. మరో రెండు మూడు రోజుల్లో 13వసారి కూడా ఇన్‌చార్జిల పాలననే పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని తెసుస్తోంది. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఆసక్తి కూడా కార్మికుల్లో నెలకొంది. మరోవైపు చేనేత పోరు ఉంటుందా... సొసైటీలు రద్దు చేస్తారా అనే సందిగ్ధం నేత కార్మికుల్లో కొనసాగుతోంది. ఐదేళ్లకొకసారి నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013లో చివరి సారిగా నిర్వహించారు. వీరి పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని 40 రోజుల ముందే నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా చేనేత కార్మికులతో ఓటు హక్కు అర్హత కలిగిన జాబితాను జౌళిశాఖ అఽధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించకుండా జీవో నంబర్‌ 568, ద్వారా సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఇన్‌చార్జిల పదవీకాలం కూడా ముగిసిపోయినా ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.

మూగబోయిన చేనేత సహకార సొసైటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత మగ్గాలపై తళుక్కున మెరిసే జరీపోగుల చీరలు కళకళాడేవి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు రావడంతో యువకులు మరమగ్గాల వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం మిగిలిపోయిన అరకోర చేనేత మగ్గాలపై వృద్ధులే ఉపాధి పొందుతున్నారు. మరమగ్గాల చప్పుళ్ల మధ్య చేనేత సహకార సొసైటీలు మూగబోయాయి. జిల్లాలో రికార్డుల ప్రకారం 13 సొసైటీలు ఉన్నారు. ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై బట్ట ఉత్పత్తి జరుగుతోంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా ఇప్పడు 204 మగ్గాలకు చేరుకున్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత మిత్ర పథకాన్ని అందిస్తున్నారు. నూలు సబ్సిడీని ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 384 మంది కార్మికులకు రూ 4.21 లక్షలు విడుదల చేశారు. రూ లక్ష వరకు రుణమాఫీ చేశారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా అప్పటి ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2,662 మంది పథకంలో చేరారు. చేనేత లక్ష్మి పథకంలో చేరిన ఉద్యోగులు బట్టలు కొనుగోలు చేశారు. ఈ పథకం మళ్లీ కొనసాగలేదు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్‌ కింద రూ 1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ 50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆఽఽధునిక డిజైనతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మొదటి విడతలో రూ 19.10 లక్షలు విడుదల చేయగా 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో 175 మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. జిల్లాలో సిరిసిల్లలో 76 మగ్గాలు, వేములవాడలో నాలుగు, వేములవాడ మండలంలో ఏడు, చందుర్తిలో ఎనిమిది, బోయినపల్లిలో 27, తంగళ్లపల్లిలో 34, ఇల్లంతకుంటలో నాలుగు, గంభీరావుపేటలో ఒకటి, కోనరావుపేటలో 14 ఉన్నాయి. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాంబ సొసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపల్లి సొసైటీలతో పాటు ఖాదీగ్రామోద్యోగ్‌, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి. చేనేత కార్మికుడికి పదిహేను రోజుల పాటు కష్టపడితే 500 రూపాయల నుంచి 800 రూపాయలవరకే కూలి లభిస్తోంది. చేనేత మగ్గాలకు కండెలు చుట్టే వృద్ధ మహిళలు ఒక నూలు లడి చుడితే ఆరు రూపాయల నుంచి 10 రూపాయలు మాత్రమే లభిస్తాయి. పొద్దంతా చుడితే 50 రూపాయలు మాత్రమే వస్తాయి. చీరలోని గొప్పతనాన్ని చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమిరే చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలను నేసి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఉనికిని మాత్రం కొందరు యువకులు బతికించే ప్రయత్నం చేస్తున్నారు. వారుకూడా మరమగ్గాలపైనా ప్రయోగాలు చేయడంపై దృష్టి పెట్టారు.

చేనేత సంఘాలు రద్దవుతాయా?

చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో రద్దు చేస్తారనే అనుమానాలు సొసైటీ సభ్యుల్లో వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్లుగా ఎన్నికలు జరపకపోవడంతో పాటు తెలంగాణ హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌, పవర్‌లూం కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం టెస్కొ ఉనికి ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. సహకార సంఘాలకు పని కల్పించడం, అవి తయారు చేసిన బట్ట ఉత్పత్తులను కొనుగోలు టెస్కొ చేసేది. రెండు కార్పొరేషన్‌లు ఏర్పడడంతో టెస్కొ మూతపడుతుందని భావిస్తున్నారు. ఆక్రమంలోనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడడమే కాకుండా చేనేత కార్మికులకు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తోంది.

Updated Date - Mar 03 , 2024 | 12:40 AM

Advertising
Advertising