ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోదావరిఖని బస్టాండ్‌లో ట్రా‘ఫికర్‌’

ABN, Publish Date - Feb 22 , 2024 | 11:50 PM

గోదావరిఖని బస్టాండ్‌లో ఆటోలతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 22: గోదావరిఖని బస్టాండ్‌లో ఆటోలతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లోకి వచ్చే దారిలో ఆటోలను అడ్డుగా పెడుతుండడంతో బస్సులు లోపలికి వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే సారి గుంపులుగుంపులుగా ఆటోలు అడ్డం పెట్టడంతో బస్సులు ఆటో లను ఢీకొడుతున్నాయి. అయినప్పటికీ ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకే తీసుకురావడంతో తాము లోపలికి వెళ్లలేక పోతున్నామంటూ బస్సుల డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఆటో డ్రైవర్లకు చెప్పినా వినడం లేదని, అకస్మాత్తుగా బస్సుల ముందుకు ఆటోలను తీసుకురావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ ప్రమాదాలకు తమనే అధికారు లు బాధ్యులను చేస్తున్నారని వాపోతున్నారు. కూతవేటు దూరంలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ ఆటో వాలాలను నియంత్రించలేక పోతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాజీవ్‌ రహదారి నుంచి వచ్చే భక్తులు లోపలికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిన పరి స్థితులు ఏర్పడుతున్నాయి. యూనియన్లు కూడా పట్టించుకోకపోవ డంతో ఆటోవాలాలు రోజురోజుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకే సారి గుంపులుగుంపులుగా ఆటోలు రావడంతో బస్సు డ్రైవర్లు అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వెనుక నుంచి వచ్చిన వాహనాలు ఢీకొట్టిన సంఘటనలున్నాయి. రాత్రి వేళల్లో ఆటో డ్రైవర్‌కు మరొకరు తోడుగా పెట్టుకుని ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నారు. ఇప్పటికైనా గోదావరిఖని బస్టాండ్‌లో ట్రాఫిక్‌ గందరగోళం సృష్టిస్తు న్న ఆటోడ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, బస్సు డ్రైవ ర్లు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Feb 22 , 2024 | 11:50 PM

Advertising
Advertising