ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:20 PM
ప్రజావాణి సమస్యలను సాధ్యమైనంత తొందరలో పరిష్కరించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జగిత్యాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి సమస్యలను సాధ్యమైనంత తొందరలో పరిష్కరించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమ వారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి హాజరై పలువురు బాధితులు అందించిన వినతి పత్రాల ను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై ఇచ్చిన 50 దరఖాస్తులను ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించా రు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫించన్ల మంజూరు, భూ సమస్యలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలపై ఆర్జీలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్‌డీఓలు మధు సుదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, కలెక్టరేట్ కార్యాలయ ఏఓ హన్మంతరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:20 PM