పన్నుల వసూళ్లకు కసరత్తు
ABN, Publish Date - Feb 03 , 2024 | 12:52 AM
ఈ ఏడాది కూడా పల్లెల్లో ఆస్తి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని గడువులోపే పూర్తి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచే దిశగా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల సహకారంతో జిల్లాలో ఇప్పటికే 86.1 శాతం పన్నుల వసూలు పూర్తి చేశారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఈ ఏడాది కూడా పల్లెల్లో ఆస్తి పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని గడువులోపే పూర్తి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచే దిశగా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల సహకారంతో జిల్లాలో ఇప్పటికే 86.1 శాతం పన్నుల వసూలు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక అధికారులపై పన్నుల వసూళ్లు భారం పడనుంది. జిల్లాలో రూ.77 లక్షల 28 వేల 51 వసూలు కావాల్సి ఉంది. కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పన్నుల వసూలు పైనే ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
జిల్లా పన్నుల వసూలు లక్ష్యం
జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దృష్టిసారించారు. వరుసగా పన్నుల వసూళ్లలో వంద శాతం పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లోపని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల్లో రూ.5 కోట్ల 56 లక్షల 7 వేల 513 వసూలు లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో రూ.4 కోట్ల 78 లక్షల 79 వేల 456 వసూలు చేశారు. ఇంకా రూ. 77 లక్షల 28వేల 057 వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో వీర్నపల్లి మండలంలో రూ.11,37,291 పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేసి వంద శాతంలో నిలిచారు. బోయినపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో రూ.31,04,086కి రూ.26,67,165 వసూలు చేశారు. చందుర్తి మండలంలో 19 గ్రామ పంచాయతీల్లో రూ.36,38,713కి రూ.31,83,493 వసూలు చేశారు. ఇల్లంతకుంట మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో రూ.41,66,140కిగాను రూ .39,62,652, గంభీరావుపేట మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో రూ.64,60,915కి గాను 47,77,260, కోనరావుపేట మండలంలో 28 గ్రామ పంచాయతీల్లో రూ.40,39,428కిగాను రూ.39,95,350, ముస్తాబాద్ మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో రూ78,99,290కిగాను రూ.67,51,067, రుద్రంగి మండలలో పది గ్రామ పంచాయతీల్లో రూ. 22,89,587కిగాను రూ.21,30,706, తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో రూ.66,93,801కిగాను రూ.62,14,652, వేములవాడ మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో రూ.62,18,276కిగాను రూ.52,60,194, వేములవాడ రూరల్ మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో రూ .21,23,105కిగాను రూ.17,92,001, ఎల్లారెడ్డిపేట మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో రూ.78,36,881కిగాను రూ.60,07,625 వసూలు చేశారు. మిగిలిన వసూలుకు కసరత్తు చేస్తున్నారు.
గడువులోపే లక్ష్యం పూర్తి
- రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. గడువులోపే వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు కలెక్టర్ మార్గదర్శనంలో 86.1 శాతం పూర్తి చేశాం. ప్రతీ సంవత్సరం వంద శాతం పన్నూలు వసూలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాం. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
Updated Date - Feb 03 , 2024 | 12:52 AM