ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాధిత కుటుంబాలకు అండగా పోస్టల్‌ ప్రమాద బీమా

ABN, Publish Date - Feb 19 , 2024 | 12:34 AM

భారత తపాల శాఖ రోజు రోజుకు వినియోగదారులకు సేవలు విస్తరిస్తున్నది. ప్రజలకు చేయూత నందించేందుకు గాను కొత్త కొత్త స్కీంలుప్రవేశపెట్టి వినియోగదారుల మన్ననలు పొందుతున్నది. నిత్యం ఉత్తరాల బట్వాడా, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలోనే సరిపెట్టకుండా ప్రజలకు మరింత చేయూతగా నిలవాలనే సంకల్పంతో పథకాలను ప్రవేశపెట్టి వినియోగదారులకు అండగా నిలుస్తున్నది.

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 18: భారత తపాల శాఖ రోజు రోజుకు వినియోగదారులకు సేవలు విస్తరిస్తున్నది. ప్రజలకు చేయూత నందించేందుకు గాను కొత్త కొత్త స్కీంలుప్రవేశపెట్టి వినియోగదారుల మన్ననలు పొందుతున్నది. నిత్యం ఉత్తరాల బట్వాడా, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలోనే సరిపెట్టకుండా ప్రజలకు మరింత చేయూతగా నిలవాలనే సంకల్పంతో పథకాలను ప్రవేశపెట్టి వినియోగదారులకు అండగా నిలుస్తున్నది. భారత తపాల శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పోస్టల్‌ ప్రమాద బీమా పథకం బాఽధిత కుంటుంబాలకు అండగా నిలుస్తున్నది.

ఫ దరఖాస్తు చేసిన వెంటనే ఖాతాల్లో జమ

తపాల ప్రమాద బీమా చేసుకున్న వారు మరణిస్తే దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరైన పది లక్షల రూపాయలను నేరుగా నామిని బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. కరీంనగర్‌ డివిజన్‌ వ్యాప్తంగా తపాల శాఖ ఆధ్వర్యంలో తపాల ప్రమాద బీమా చేసుకున్న 21 మంది మృతి చెందగా, వారికి ప్రమాద బీమా సొమ్మును అందించారు. గాయాలతో చికిత్స పొందిన 40 మందికి క్లైమ్స్‌ అందించింది. ప్రమాద బారిన పడిన 21 మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున, గాయపడిన 40 మందిలో పది వేల నుంచి 70 వేల రూపాయల వరకు ప్రమాద బీమా సాయం అందించింది. పోస్టల్‌ శాఖ. గత సంవత్సరం యాభై వేలమంది ప్రమాద బీమాచేసుకోగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు కరీంనగర్‌ డివిజన్‌ వ్యాప్తంగా 25 వేల మంది ప్రమాద బీమా చేసుకున్నారు.

ఫ రేపటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఐదు ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా మూడు రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల పాలసీలు 320 రూపాయల నుంచి మొదలుకొని 775 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రమాద బీమా తీసుకునే వారు 200 రూపాయలతో ఐపీపీబీ ఖాతా తెరవాల్సి ఉంటుంది. వినియోగదారులకు వీలైన పాలసీని ఎంచుకుని దగ్గరలోని పోస్టాఫీసుల్లో సంప్రదిస్తే ప్రమాద బీమా పాలసీని తీసుకునే విధంగా పోస్టల్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఫ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- శివాజి, కరీంనగర్‌ డివిజన్‌ పోస్టల్‌ ఎస్పీడీ

తపాల శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలి. ఈ నెల 20 నుంచి చేపట్టనున్న స్పెషల్‌డ్రైవ్‌లో పాలసీలు పొందాలి. ఆసక్తి ఉన్న వారు సమీప పోస్టాఫీసును సంప్రదించాలి.

Updated Date - Feb 19 , 2024 | 12:34 AM

Advertising
Advertising