ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా అమలు చేయాలి
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:09 AM
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.
పెద్దపల్లి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పార్టీ నాయకులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికినిరసనగా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల హామీలలో భాగంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎల్‌ఆర్ ఎస్‌ని పూర్తిగా నయా పైసా ఖర్చు లేకుండా చేస్తామని బూటకపు వాగ్దానం తో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంట సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీ రావు, పెద్దపల్లి పట్టణ, మండల అధ్యక్షులు ఉప్పు రాజు కుమార్, మర్కు లక్ష్మన్, పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్, వివేక్ స్వామి పటేల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:09 AM