‘గృహ జ్యోతి’ పేద ప్రజలకు వరం
ABN, Publish Date - Mar 04 , 2024 | 11:24 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం అనేది పేదింటి ప్రజలకు ఒక వరమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, మార్చి 4: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం అనేది పేదింటి ప్రజలకు ఒక వరమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి మండల కేంద్రంలోని ముదిరాజ్‌వాడలో గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. తాజాగా ప్రతి పేదింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని నియోజకవర్గంలో ప్రారంభిం చడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగించుకునే విషయంలో 200 యూనిట్ల వరకు ఎవరు కూడ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలో ఎక్కడైనా విద్యు త్ స్థంభాలు అవసరం ఉంటే తన దృష్టికి తీసుక రావాలని ఆయన అన్నారు. ఇందు కోసం నిధులు మంజూరు చేయించి సమస్య పరిష్కరి స్తానని ఆయన తెలిపారు. ధర్మపురి పట్టణ ప్రజలకు తాగు నీరందించే విషయంలో నెలకొన్న సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందు కోసం ఒక కోటి నిధులు కూడ కేటయించడం జరిగిందని ఆయన అన్నారు. అతి త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడ అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మిగిలి పోయిన గ్యారెంటీ పథకాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుక రావాలని ఆయన కోరారు. రాబోవు కాలంలో ధర్మపురి పట్టణ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఆయన జీరో బిల్ అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణ, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మండల తహసీల్దార్ కృష్ణచైతన్య, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఇందారపు రామయ్యయ, కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, జక్కు పద్మ, సంగనభట్ల సంతోషి, గరిగె అరుణ, కొంపల పద్మ, ట్రాన్స్‌కో డీఈఈ రాజరెడ్డి, ఏడీఈ సిందూర్‌శర్మ, ఏఈఈ రవి, పిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 11:24 PM