ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓసీపీ-3లో సమస్యలను పరిష్కరించండి

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:08 AM

ఓసీపీ-3 ప్రాజెక్టులో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఐఎన్‌టీయూసీ నాయకులు మేనేజర్‌ రమేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 7: ఓసీపీ-3 ప్రాజెక్టులో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఐఎన్‌టీయూసీ నాయకులు మేనేజర్‌ రమేష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 100 టన్నుల డంపర్‌ పార్కింగ్‌ యార్డు విస్తరించి, రోడ్డు డివైడర్‌ ఏర్పాటు చేయడం, వాటర్‌ పాయింట్‌, టాయిలెట్లు నిర్మించాలని కోరారు. డంపర్లకు రేడియంతో నంబర్లు వేయాలని, డంపర్‌ క్యాబిన్ల క్లీనింగ్‌ కోసం పార్కింగ్‌ యార్డులో వాక్యూమ్‌ క్లీనర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పీఓ, మేనేజర్‌ కార్యాలయ సిబ్బంది వాహనా పార్కింగ్‌ కోసం షెడ్‌లు, లంచ్‌ రూం నిర్మించాలని మేనేజర్‌ని కోరారు. ఈపీ ఆపరేటర్లకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను బ్యాక్‌ డేట్‌ను పరిగణలోకి తీసుకుని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎండాకాలన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్‌ ట్యాంకర్ల కోసం కోల్‌బెంచ్‌లో వాటర్‌ ఫిల్లింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని, కృషి భవన్‌ క్యాంటీన్‌ను విస్తరించాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రాజెక్టుకు వచ్చే రోడ్డును విస్తరించాలని, సీఎంపీఎఫ్‌ లోన్‌కు తరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన లోన్‌ ఇప్పించాలని మేనేజర్‌ను ఐఎన్‌టీయూసీ బృందం కోరింది. ఫేజ్‌-2లో మ్యాన్‌ పవర్‌ను పెంచాలని, పవర్‌ సిస్టంలో యాక్టింగ్‌ చేస్తున్న జనరల్‌ మజ్దూర్‌లక హెల్పర్లుగా ప్రమోషన్‌ ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్జీ-2 వైస్‌ప్రెసి డెంట్‌ కొత్త సత్యనారాయణరెడ్డితో పాటు సంపత్‌రెడ్డి, ఆకుల రాజయ్య, సల్ల శ్రీనివాస్‌, ఓదేలు, ఉస్మాన్‌, ఇంద్రసేన, రమేష్‌రెడ్డి, లక్ష్మయ్య, వెంక న్న, రవిపటేల్‌, సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:08 AM

Advertising
Advertising