ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కల్యాణం..కమనీయం

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:57 PM

గడప గడపకు గోవు, గో విందుడు, గీత అనే నినాదంతో లక్ష్యఛేదన ఫౌండేష న్‌ చేపట్టిన శ్రీవారి తిరుమల మహా పాద యాత్ర 28వ రోజు శనివారం ఉండవల్లి మండల కేంద్రానికి చేరుకుంది.

స్వామివారి కల్యాణాన్ని జరిపిస్తున్న వేదపండితులు

- ఉండవల్లిలో వైభవంగా

వేంకటేశ్వరస్వామి కల్యాణం

- గడప గడపకు గోవు, గోవిందుడు, గీత కార్యక్రమంపై విస్తృత ప్రచారం

- మండల కేంద్రానికి చేరిన శ్రీవారి తిరుమల మహా పాదయాత్ర

ఉండవల్లి, ఫిబ్రవరి 17: గడప గడపకు గోవు, గో విందుడు, గీత అనే నినాదంతో లక్ష్యఛేదన ఫౌండేష న్‌ చేపట్టిన శ్రీవారి తిరుమల మహా పాద యాత్ర 28వ రోజు శనివారం ఉండవల్లి మండల కేంద్రానికి చేరుకుంది. రథయాత్ర బృందానికి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌కు చెందిన గట్టు అరుంధతి రంగాచార్యులు సంకల్పంతో చేపట్టిన శ్రీవారి తిరు మల మహా పాదయాత్రను ఉద్దేశించి వారు మా ట్లాడుతూ ప్రతీ హిందూ కుటుంబం భగవద్గీతను పఠించాలని అన్నారు. ఇలా చేయడం వలన చిన్నారులు, యువత పెడదారిన పడకుండా మానవ త్వం, మానవ విలువలు, కుటుంబ విలువలు, ప్రకృ తి, దేశం, దాన, ధర్మాల పట్ల బాధ్యతలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. గోవు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గో ఆధారిత వ్యవసాయం చేపట్టవచ్చ న్నారు. నక్షత్రవనం, రసాయనిక రహిత, ప్రకృతి వ్య వసాయం వంటి విషయాలపై భక్తులకు వివరించా రు. యాత్ర ముగింపు మార్చి 6న తిరుమలకు చేరు కుంటుందన్నారు. ప్రతీ రోజు కల్యాణం నిర్వహిస్తూ విశ్వశాంతికి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాత్రి అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యే కంగా వేసిన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు వేదపండితు లు కల్యాణం జరిపించారు. 27 నక్షత్రాలకు గుర్తుగా 27 రకాల ఔషధ మొక్కలను నాటారు. మానవ మనుగడకు పర్యవరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వీరివెంట త్రిదండి చిన్నజీయర్‌ స్వామి భక్త బృందం 80మంది సభ్యులు పాల్గొన్నారు. వీరికి చల్లా వెంకట్రామి రెడ్డి, చల్లా శ్రీరామి రెడ్డి ఆలయ కమిటీ తరపున మహా పాదయాత్రలో పాల్గొన్న వారందరిని సత్కరించారు. అనంతరం భక్తులతో కలిసి కల్యాణ భోజనం చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:58 PM

Advertising
Advertising