ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవోపేతంగా కల్యాణ మహోత్సవం

ABN, Publish Date - Feb 22 , 2024 | 12:04 AM

మండలంలోని సిరిపురంలో భ్రమరాంభికా సమేత మల్లిఖార్జునస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

రామన్నపేట, ఫిబ్రవరి 21: మండలంలోని సిరిపురంలో భ్రమరాంభికా సమేత మల్లిఖార్జునస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, మంగళస్నానాలు, విశేష అలంకరణ, ఎదుర్కోలు మహో ్సవం, మూల మంత్రం, హోమం నిర్వహించారు. ఏళ్ల రాజశేఖ ర్‌రెడ్డి, బోడే శ్రీనివాసరెడ్డి, పల్లెమల్లి ఖార్జున్‌రెడ్డి, పాండుయాదవ్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఏళ్ల బుచ్చిరెడ్డి, ఏళ్ల రాజశేఖర్‌రెడ్డి, ఏళ్ల నాగమణి, రాపోలు రమేష్‌, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాజాపేట: మండలంలోని యాదాద్రి మేడారం, చిన్నమేడారం లక్ష్మకపల్లి సమ్మక్క సారలమ్మల ఆలయాలు భక్తులతో నిండిపో యాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఆయా ఆలయాల వద్ద భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం గద్దెల వద్దకు సారలమ్మలను భక్తుల జన సంద్రోహంతో డప్పు వాయిద్యాలతో తరలించారు. చిన్న మేడారంలో కుర్రారం వైపు ఉన్న ఎదుల్లగుట్ట నుంచి యాదాద్రి మేడారంలో పడమటి గుట్ట నుంచి సారలమ్మను గద్దెల పైకి తరలించారు.

ఆలేరు రూరల్‌: కొలనుపాకలో గల సమ్మక్క సారలమ్మలు మహిమాన్వితమని సమ్మక్క సారలమ్మల గద్దెల నిర్మాణ ఫౌండర్‌ సబితారెడ్డి అన్నారు. బుధవారం నుంచి 3 రోజుల పాటు సమ్మక్క సారలమ్మల పండుగ ఘనంగా ని ర్వహి స్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఆత్మకూరు(ఎం): మండలకేంద్రంలో జరుగుతున్న కనక దుర్గాదేవి ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు బుధవారం రెండో రోజు ఘనంగా జరిగాయి. గోపూజ, మంటప దేవతాపూజలు, దేవతాహోమములు, అధివాసహోమము, క్షీరాధివాసం, సాయంత్రం కళాన్యాసహోమము, ధాన్యాధివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, బలిహరణ, కార్యక్రమాలను నిర్వహించారు. నూతనంగా ప్రతిష్ఠిస్తున్న కనకదుర్గాదేవి, సంతోషిమాత, కాశీవిశ్వనాథస్వామి, ఆంజనేయస్వామి, గణపతి, సుబ్రమణ్యస్వామి దేవతామూర్తుల విగ్రహాలకు నిర్వహిం చిన ధాన్యాధివాసంలో భక్తులు వివిధ ధాన్యాలను పోసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత ఏనుగు సురేం దర్‌రెడ్డి, సుగంధిని దంపతులు, ఎంపీటీసీ వై.కవిత, మాజీ ఎంపీపీ పి.హేమలత, మాజీ జడ్పీటీసీ పి. పూర్ణచందర్‌రాజు, నాయకులు యాస లక్ష్మారెడ్డి, బీసు చందర్‌, గడ్డం దశరథ, ఎం.మల్లేశం, ఎస్‌. పుల్లారెడ్డి, టి. నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2024 | 12:04 AM

Advertising
Advertising