Kidnap: హైదరాబాద్: 9 నెలల చిన్నారి కిడ్నాప్..కేసును చేధించిన పోలీసులు..
ABN, Publish Date - Mar 03 , 2024 | 09:13 AM
హైదరాబాద్: పాతబస్తీ మదన్న పెట్‌లో కిడ్నప్‌కు గురైన 9 నెలల చిన్నారి సేఫ్.. పోలీసులు కేసును చేధించారు. జహీరాబాద్‌లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్, మదన్న పెట్ పోలీసులు.. చంచల్ గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు..
హైదరాబాద్: పాతబస్తీ మదన్న పెట్‌లో కిడ్నప్ (Kidnap)కు గురైన 9 నెలల చిన్నారి సేఫ్.. పోలీసులు కేసును చేధించారు. జహీరాబాద్‌లో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసిన హైదరాబాద్, మదన్న పెట్ పోలీసులు.. చంచల్ గూడ నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు ఎంజీబీ బస్ స్టేషన్‌లో జహీరాబాద్ బస్‌లో వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని పాపను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
పూర్తి వివరాలు..
పాతబస్తీ మదన్న పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలోని నర్సింగ్ హోమ్ హాస్పిటల్‌లో 9 నెల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఆ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్ ఖాన్.. ఇంట్లో పనులు ముగించుకొని పాపను తీసుకుని పరారీ అయ్యారు. షహనాజ్ ఖాన్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం చత్తీస్‌గఢ్‌కు చెందినట్లు గుర్తించారు. దీంతో బాధితులు మదన్న పెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును చేధించారు.
కాగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను ఎత్తుకుని పోయే బ్యాచ్ తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే… హైదరాబాద్ చంచల్‌గూడలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ అయింది. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పోలీసులు కూడా హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.
Updated Date - Mar 03 , 2024 | 09:14 AM