ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాలమూరు నుంచి పోరు షురూ!

ABN, Publish Date - Mar 03 , 2024 | 04:05 AM

మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ నెల 6న నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభలో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

6న బహిరంగ సభలో రేవంత్‌ ఎన్నికల శంఖారావం ..

సీఎంను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు..

కేటీఆర్‌.. ఏ ముఖం పెట్టుకొని మేడిగడ్డకు వెళ్లావ్‌?: ఆది శ్రీనివాస్‌

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: యెన్నం

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ నెల 6న నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభలో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో పాలమూరు ప్రజాదీవెన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ హాజరుకానున్నారు. ఇదే విషయమై శనివారం రేవంత్‌ను ఆయన నివాసంలో వం శీచంద్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, వాకిటి శ్రీహరి, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ కలిశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కోరారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సభ.. రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఏ ముఖం పెట్టుకుని మేడిగడ్డకు వెళ్లారంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌.. కుంగిన పిల్లర్ల ముందు ఫొటో దిగి ట్విటర్‌లో పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. యెన్నం శ్రీని వాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. 60 మంది జోకర్లు విహారయాత్రకు వెళ్లినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతల మేడిగడ్డ టూర్‌ ఉందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

విద్య, ఆరోగ్య రక్షణ ద్వారానే రాష్ట్రాభివృద్ధి

ప్రజాస్వామ్యం వర్ధిల్లినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని, విద్య, ఆరోగ్య రక్షణ ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. నియంతృత్వంతో ప్రజలకు మేలు జరగబోదని.. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం మాత్రమే న్యాయం చేకూరుస్తుందని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని గాంధీ సెంటినరీ హాల్లో శనివారం కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ ఆధ్వర్యంలో ‘ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారు?’ అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆమె ప్రసగించారు. టీపీసీసీ నేతలు పవన్‌ మల్లాది, రియాజ్‌, పలు ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు ఇందులో పాల్గొన్నారు. కేసీఆర్‌ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అన్నారు.

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించండి..

దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం తాము రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రభుత్వం చేత అమ లు చేయించాలని జాతీయ దివ్యాంగుల నెట్‌వర్క్‌ టీపీసీసీని కోరింది. గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరిలను కలిసిన జాతీయ దివ్యాంగుల నెట్‌వర్క్‌ కన్వీనర్‌ అర్మాన్‌ అలీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మహేశ్‌ గౌడ్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇటు మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతిని సందర్భంగా ఇందిరాభవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

Updated Date - Mar 03 , 2024 | 04:05 AM

Advertising
Advertising