ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేలతల్లి తడారకుండా..

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:17 AM

వేసవి ఇంకా మొదలవ్వకముందే రైతన్నలకు నీటి కష్టాలు మొదలైపోయాయి. సాగునీటి కొరతతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట ఎండిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో వ్యవసాయ బావులు, బోరుబావుల్లో నీళ్లు

పంటను కాపాడుకునేందుకు సిద్దిపేట జిల్లా రైతుల పాట్లు

అక్కన్నపేట, ఫిబ్రవరి 29: వేసవి ఇంకా మొదలవ్వకముందే రైతన్నలకు నీటి కష్టాలు మొదలైపోయాయి. సాగునీటి కొరతతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట ఎండిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో వ్యవసాయ బావులు, బోరుబావుల్లో నీళ్లు ఉండడం లేదు. దీంతో వరి మడులకు నీరందించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ఎండిపోతుందేమో అని భయపడుతున్నారు. అక్కన్నపేటకు చెందిన గొట్టే మహేందర్‌ అనే రైతు తన నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటివరకు రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పంట ప్రస్తుతం పొట్ట దశకు చేరుకోగా.. బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో తడులు పారించేందుకు నానా తంటాలు పడుతున్నాడు. గ్రామానికి చెందిన ఓ రైతు బోరుబావిని రూ.10 వేలకు అద్దెకు తీసుకొని ట్యాంకర్‌ ద్వారా నీటిని తీసుకువచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Updated Date - Mar 01 , 2024 | 04:17 AM

Advertising
Advertising