Kumaram Bheem Asifabad- నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ABN, Publish Date - Mar 03 , 2024 | 10:32 PM
కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఎన్నికల సోమవారం జరుగనుంది. ఈ ఎన్నిక ప్రక్రియ కాగజ్‌నగర్ ఆర్డీవో సురేష్ ఆధ్వర్యంలో కమిషనర్ అంజయ్య, సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల ఎన్నిక ప్రారంభించనున్నారు.
కాగజ్‌నగర్ టౌన్, మార్చి 3: కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఎన్నికల సోమవారం జరుగనుంది. ఈ ఎన్నిక ప్రక్రియ కాగజ్‌నగర్ ఆర్డీవో సురేష్ ఆధ్వర్యంలో కమిషనర్ అంజయ్య, సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల ఎన్నిక ప్రారంభించనున్నారు. గత నెల 26న మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్‌పై అవిశ్వాసం ప్రవేశ పెట్టి నెగ్గడంతో మార్చి 4న తేదీ ఖరారు అయిన విషయం తెల్సిందే. ఈ పదవి ఎవరికి దక్కుతుందోననే సస్పెన్స్ ఇంత వరకు కొనసాగింది. కాగజ్‌నగర్‌లోని మున్సిపాలిటీలో 30 వార్డులకు గానూ బీఆర్‌ఎస్ బలం ఎక్కువగా ఉండడంతో బీఆర్‌ఎస్ నాయకుడే చైర్మన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్‌పై కౌన్సిలర్లు గత నెలలో పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సద్దాం హుస్సేన్ తన పదవి కోల్పోయారు. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిల్‌లో మెజారిటీ స్థానాలు బీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకోవడంతో చైర్మన్‌గా సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్‌గా రాచకొండ గిరీష్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 సంవత్సరాల అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై అవిశ్వాసం పెట్టారు. ఫిబ్రవరి 26న మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గగా, ఆర్టీవో ఎన్నికలపై కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజుకున్న వేడి గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ పదవీ గండం ఏర్పడింది. అసంతృప్త కౌన్సిలందరికీ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి నాయకత్వం వహించారు. ప్రస్తుతం దస్తగిరి సమీప బంధువు 19 వార్డు కౌన్సిలర్ షాహీన్ సుల్తానా కౌన్సిలర్‌గా ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 19వ వార్డు కౌన్సిలర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే గతంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా ఉన్నటువంటి రాజేందర్ సైతం అవిశ్వాసం కోసం కృషి చేయడంతో ఇద్దరి పేర్లు చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కేవలం పది నెలల పాటు అధికారంలో ఉండే అవకాశాలున్నాయి. నిధులు సకాలంలో వస్తాయా..? అభివృద్ధి పనులు జరుగక పోతే పరిస్థితి ఎంటీ...? అనే కో ణంలో చైర్మన్ బరిలోకి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్ వర్గానికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. గత చైర్మన్ సద్దాం హుస్సేన్‌ను దింపే ప్రయత్నంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప వర్గం సభ్యులు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కోనప్ప వర్గం నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్ వర్గానికి ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది. దీంతో ఈ ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. మెజార్టీ కౌన్సిలర్లు కూడా అంగీకరించినట్టు తెలిసింది.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
- సురేష్, ఆర్డీవో
మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునేందుకు సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. సోమవారం ఉదయం 10.30 గం టల నుంచి సమావేశం ఉంటుంది. ఇందుకు 30 వార్డుల కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చాం. ఎన్నిక ప్రక్రియకు సంబంఽధించి విధివిధానాలు కమిషనర్ ద్వారా కౌన్సిలర్లకు తెలియజేశాం.
Updated Date - Mar 03 , 2024 | 10:32 PM