గడువులోగా ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:24 PM
నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డైరవ్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, మార్చి 4 : నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డైరవ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఽఈనెల 9వ తేదీ వరకు స్పెషల్ డైరవ్ ద్వారా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆన్లైన్‌లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ కార్డు ఉన్న వారికీ పని కల్పించాలని ఆదేశించారు. క్లస్టర్ వారీగా సమావేశాలు నిర్వహించి ఊరికి ఉపయోగపడే పనులు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల ప్రగతిపై చర్చించారు. అంతేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లాలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. బొంరా్‌సపేట్, కొడంగల్ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాల తనిఖీ
పరిగి: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రలో సీసీ కెమెరాలు, వసతులు, పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, ఛీప్‌సూపరింటెండెంట్ మక్బూల్, డీవో లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 10:25 PM