నీళ్లంటే నిర్లక్ష్యమా ?
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:14 AM
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సమీక్షలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఆదేశాలను బేఖారు చేస్తున్నారు.
బషీరాబాద్, మార్చి 3: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సమీక్షలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఆదేశాలను బేఖారు చేస్తున్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని గోసాయికాలనీ, మైనార్టీ కాలనీల్లో నల్లాలకు ఆన్‌ఆఫ్ సిస్టం లేకపోవడంతో గంటల తరబడి తాగు నీళ్లు వృఽథాగా పోతోంది. మరో పక్క ఎండలు ముదరడంతో భూ గర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఉన్న నల్లాల ద్వారా నీరు వృథాగా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Mar 04 , 2024 | 12:14 AM