ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మోత్కూరులో క్యాంపు రాజకీయం

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:23 AM

మోత్కూరు మునిసిపాలిటీలో అవిశ్వాసంతో ఖాళీ అయిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి ఈ నెల 4న ఎన్నిక నిర్వహించను న్నారు.

మోత్కూరు, మార్చి 2: మోత్కూరు మునిసిపాలిటీలో అవిశ్వాసంతో ఖాళీ అయిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి ఈ నెల 4న ఎన్నిక నిర్వహించను న్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సావిత్రిపై 9మంది కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవి శ్వాసంపై గత నెల 9న ఓటింగ్‌ నిర్వహించగా అవిశ్వాసం నెగ్గి ఆమె చైర్‌పర్సన్‌ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 4న నూతన చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ కౌన్సిలర్లకు సమావేశం నోటీసులు అందజేసినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ సి. శ్రీకాంత్‌ తెలిపారు. నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కలిసి క్యాంపు నిర్వహిస్తున్నారు. మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు 8మంది, కాంగ్రెస్‌కు నలుగురు కౌన్సిలర్లు ఉండగా గత చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆరుగురు, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నలుగురు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇప్పు డు ఆ పది మంది కౌన్సిలర్లలో 9మంది శనివారం శిబిరానికి వెళ్లగా, వైస్‌చైర్మన్‌ ఆదివారం శిబిరానికి వెళ్లనున్నట్టు తెలిసింది. 11వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 03 , 2024 | 09:12 AM

Advertising
Advertising