డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలి
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:56 PM
టెట్, డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని డైట్ ద్వి తీయ సంవత్సరం చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు కోరారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఛాత్రోపాధ్యాయులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 4: టెట్, డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని డైట్ ద్వి తీయ సంవత్సరం చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఛాత్రోపాధ్యాయులు మాట్లాడుతూ తమ శిక్షణ 2022లో పలు కారణాల వల్ల ఐదు నెలలు ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలి పారు. దాంతో ద్వితీయ ఏడాది పరీక్షలు కూడా ఆలస్యమైనట్లు వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టెట్ నిర్వహించి, 2024 డీఎస్సీలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో డైట్ ఛాత్రో పాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 10:56 PM