ముఖ్యమంత్రిని సవాల్ చేసే స్థాయి కేటీఆర్‌కు లేదు
ABN, Publish Date - Mar 03 , 2024 | 10:28 PM
ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి సవాల్ విసిరే స్థాయి ఎమ్మెల్యే కేటీఆర్‌కు లేదని, అసహనానికి గురై ఏదో మాట్లాడుతున్నా డని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విమర్శించారు.
మందమర్రి టౌన్, మార్చి 3: ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి సవాల్ విసిరే స్థాయి ఎమ్మెల్యే కేటీఆర్‌కు లేదని, అసహనానికి గురై ఏదో మాట్లాడుతున్నా డని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజల కు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అధికారం లోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఘనత తమ ప్రజా ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆదివారం మం దమర్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిం దని, ప్రజల సంక్షేమం అటకెక్కిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సం బంధించి నిపుణుల కమిటీని వేసిందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కేసీఆర్ కుటుంబాన్ని ఎవరు కాపాడలేరని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పాత బస్టాండ్ శాంతినగర్ ఏరియాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లక్ష్మి నివాసంలో గృహ జ్యోతి పథకం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఎంతో ఊరట అని ఆయన పేర్కొ న్నారు. ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలు చేస్తున్న ప్రభు త్వం తమదేనని, మిగతా హామీ లను కూడా అమలు చేస్తామ న్నారు. నోముల ఉపేందర్ గౌడ్, సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్, బండి సదానందం యాదవ్, మం ద తిరుమల్, ఒడ్నాల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
కరాటే పోటీలు ప్రారంభం
ఆత్మస్థయిర్యం కోసం ప్రతీ ఒక్కరు కరాటే నేర్చు కోవాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొ న్నారు. సీఐఎస్‌ఎఫ్ బ్యారెక్‌లో కాకా వెంకటస్వామి స్మారక సౌత్ ఇండియా లెవల్ కరాటే పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పోటీ లకు 400 మంది క్రీడాకారులు హాజరు కావడం గొప్ప విషయమన్నారు. పోటీల నిర్వహణకు సంబం ధించి రంగు శ్రీనివాస్, బండి సదానందంలు ఏర్పా ట్లు చేశారని అభినందించారు. క్రీడాకారులు గెలు పు ఓటములను ఒకే విధంగా తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్, నిర్వాహకులు బండి సదానందం హాజరయ్యారు.
Updated Date - Mar 03 , 2024 | 10:28 PM