ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు

ABN, Publish Date - Mar 08 , 2024 | 10:13 PM

వేలాల మల్లికార్జున స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వంతో ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

జైపూర్‌, మార్చి 8 : వేలాల మల్లికార్జున స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వంతో ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి వేలాల మల్లికార్జున స్వామిని మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులు బోనాలు వండి దీపాలు వెలిగించడం జరుగుతుందని, చుట్టు ఎండిన గడ్డి, ఆకులు ఉన్నాయని, అనుకొని ప్రమాదాలు జరిగే అవకాశాలు న్నందున జాగారం చేసే భక్తులు దీపాలను గమనిస్తూ ఉండాలని సూచించారు.

ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి వరుస పద్ధతిలో అనుమతిస్తున్నామన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్‌ సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ ఉపేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 10:13 PM

Advertising
Advertising