ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీఆర్‌ఎస్‌ పాలనలో పది లక్షల కోట్ల కుంభకోణం

ABN, Publish Date - Mar 01 , 2024 | 10:32 PM

గత బీఆర్‌ఎస్‌ పాలనలో పది లక్షల కోట్లకు పైగా కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని, కళ్ల ముం దు కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వామి విమర్శించారు. నిర్మాణం చేపట్టిన మూడేళ్లలో పగుళ్లు తేలిన ప్రాజెక్టు పర్యటనకు బీఆర్‌ఎస్‌ నేతలను తీసుకురావడంపై కేటీఆర్‌ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు.

మందమర్రిటౌన్‌, మార్చి 1: గత బీఆర్‌ఎస్‌ పాలనలో పది లక్షల కోట్లకు పైగా కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని, కళ్ల ముం దు కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వామి విమర్శించారు. నిర్మాణం చేపట్టిన మూడేళ్లలో పగుళ్లు తేలిన ప్రాజెక్టు పర్యటనకు బీఆర్‌ఎస్‌ నేతలను తీసుకురావడంపై కేటీఆర్‌ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళే శ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లు, ధరణి పేరు తో హైద్రాబాద్‌ చుట్టుపక్కల 25 వేల ఎకరాల భూములను కాజేశా రని, వీటి విలువ రూ.8 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఆరోపిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు సంవత్సరాల్లో 940 టీఎంసీలు నీరు రావాల్సి ఉండగా కేవలం 160 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిం దన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు సాగు నీరందిం చాల్సి ఉండగా కుప్పకూలిపోయిందని విమర్శించారు. ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవ ర్గమే కాకుండా పక్కన ఉన్న మంథని నియోజకవర్గంలో పంటలు మునిగే పరిస్థితి నెలకొందన్నారు. కుంభకోణాలపై కమిటీ వేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. నాయకులు నోముల ఉపేందర్‌ గౌడ్‌, గుడ్ల రమేష్‌, దుర్గం నరేష్‌, సొత్కు సుదర్శన్‌, నర్సింగ్‌, శ్రీనివాస్‌, బండి సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 10:32 PM

Advertising
Advertising