ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
ABN, Publish Date - Mar 12 , 2024 | 12:05 AM
మండలంలోని కస్తాల గ్రా మంలో సోమవారం ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది.
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
చండూరు రూరల్, మార్చి 11: మండలంలోని కస్తాల గ్రా మంలో సోమవారం ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భూ తం వెంకటేశం, భార్య నాగమ్మతో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు కుమారుల ను చదివిస్తున్నాడు. సోమవారం ఉదయం వెంకటేశం పనికి వెళ్లగా భార్య ఇంటి వద్దే ఉం ది. కూలీ పనిలేకపోవడంతో సమీపంలోని చెట్టు కింద స్థానికులతో మాట్లాడుతోంది. అదే సమయంలో ఇంటినుంచి మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన ఆమె, స్థానికులు మంటల ను ఆర్పివేశారు. అంతలోనే సామాగ్రితో పాటు కుమారుల సర్టిఫికెట్లు, వెండి, బంగారు ఆభరణాలు, బైక్ కాలిబూడిదయ్యాయి. 15 గ్రాముల బంగారం, 25 తులాల వెండి, టీవీ, బైక్, 4 క్వింటాళ్ల బియ్యం, వంటసామగ్రి, మహిళా సంఘం నుంచి వచ్చిన రూ.80 వేలు, కూలీ డ బ్బులు రూ.40 వేలు మొత్తం రూ.1.20 లక్షలు అగ్నికి ఆహుతయ్యాయని, పూర్తిగా రూ.5 ల క్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు బోరున విలపించారు. బాధితులను ప్రభుత్వం ఆ దుకుని తగిన సాయం అందించాలని స్థానికులు కోరారు.
Updated Date - Mar 12 , 2024 | 12:05 AM