ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ 4 గ్రాముల కొకైన్‌ ఎక్కడ?

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:57 AM

గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో.. మరో నాలుగు గ్రాముల కొకైన్‌ ఎక్కడ? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానందకు డ్రగ్స్‌

అబ్బాస్‌ నుంచి వివేకానంద తీసుకుంది 7 గ్రాములు..

రాడిసన్‌ హోటల్‌ పార్టీలో వాడింది 3 గ్రాములు

ఆరా తీస్తున్న గచ్చిబౌలి పోలీసులు.. కేసులో మరో ఇద్దరు

ఎఫ్‌ఐఆర్‌లో వివేకానంద డ్రైవర్‌, డ్రగ్‌ సప్లయర్‌ పేర్లు

12కు పెరిగిన నిందితులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో.. మరో నాలుగు గ్రాముల కొకైన్‌ ఎక్కడ? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానందకు డ్రగ్స్‌ సరఫరా చేసిన అబ్బా్‌సను విచారించారు. ఈ క్రమంలో.. యాకుత్‌పురకు చెందిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీ నుంచి అబ్బా్‌సకు కొకైన్‌ సరఫరా అయినట్లు గుర్తించారు. అబ్బాస్‌ ఇచ్చే కొకైన్‌ను వివేకానంద డ్రైవర్‌ ప్రవీణ్‌ తీసుకెళ్లేవాడని నిర్ధారించారు. దీంతో.. మిర్జా, ప్రవీణ్‌ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. పోలీసుల దర్యాప్తులో వివేకానంద గతనెల 16న రెండు గ్రాముల కొకైన్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. 17వ తేదీన మరో రెండు గ్రాములు, 18న ఒక గ్రాము, 19న రెండు గ్రాముల కొకైన్‌ వివేకానందకు చేరినట్లు తేల్చారు. ఇదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. రాడిసన్‌లో జరిగిన పార్టీలో మూడు గ్రాముల కొకైన్‌ను వినియోగించినట్లు గుర్తించారు. దీంతో.. మిగతా నాలుగు గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలని, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ల వెనక ఎంతటి వారున్నా ఉపేక్షించరాదని పదేపదే చెబుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. ఎన్‌డీపీఎ్‌స చట్టం ప్రకారం నాలుగు గ్రాముల్లోపు డ్రగ్స్‌ సీజ్‌ అయితే శిక్షలు సాధారణంగా ఉంటాయి. అదే నాలుగు గ్రాముల కంటే ఎక్కువ ఉంటే.. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు. ఈ నేపథ్యంలో ఏడు గ్రాముల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు దొరికినా.. కోర్టులో కేసు బలంగా నిలబడేందుకు వివేకానంద దాచిన నాలుగు గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేసే దిశలో పోలీసులు అడుగులు వేస్తున్నారు.

మిర్జా పట్టుబడితేనే వెలుగులోకి డ్రగ్స్‌ లింకు!

ఇప్పటి వరకు ఈ కేసులో అబ్బాస్‌ డ్రగ్స్‌ విక్రేత అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే.. అబ్బా్‌సను విచారించాక.. మిర్జా ద్వారా కొకైన్‌ను సేకరించినట్లు గుర్తించారు. దీంతో.. ఇప్పుడు మిర్జా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను పట్టుబడితే తప్ప.. డ్రగ్స్‌ మూలాలకు వెళ్లలేమని భావిస్తున్నారు. అదేవిధంగా.. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు-- వివేకానంద, అబ్బాస్‌, డ్రైవర్‌ ప్రవీణ్‌ అరెస్టవ్వగా.. నిర్భయ్‌, కేదార్‌లను విచారించి, విడిచిపెట్టారు. పరారీలో ఉన్న ఏడుగురి కోసం గాలింపును తీవ్రం చేశారు. నిందితులు డ్రగ్స్‌ సేవించిన నెల రోజుల్లోపు పరీక్షలు నిర్వహిస్తేనే పాజిటివ్‌ వస్తుందని, రోజులు గడిస్తే నిరూపించడం ఇబ్బందికరమేనని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 10:11 AM

Advertising
Advertising