ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమ్రాబాద్‌ అభయారణ్యంలో చిరుతలు 173

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:56 AM

నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో చిరుత పులుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా చిరుత పులుల గణకాల నివేదికను

రాష్ట్ర వ్యాప్తంగా 334 నుంచి 297కు తగ్గుదల

దేశ వ్యాప్తంగా 2022 గణనను వెల్లడించిన ఎన్‌టీసీఏ

మన్ననూర్‌, ఫిబ్రవరి 29: నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో చిరుత పులుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా చిరుత పులుల గణకాల నివేదికను నేషనల్‌ కన్సర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ), వైల్ట్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా గురువారం విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతం(ఏటీఆర్‌)లో 2018లో 160 చిరుతలుండగా 2022 నాటికి 173కి పెరిగాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 2018లో 334 చిరుతలుండగా 2022 నాటికి వాటి సంఖ్య 297కు తగ్గింది. చిరుత పులులకు నల్లమల ప్రాంతంలో అనువైన వాతావరణం, మెరుగైన పరిరక్షణ పద్దతులు ఉన్న కారణంగానే వాటి సంఖ్య పెరిగిందని డీఎ్‌ఫఓ రోహిత్‌ గోపిడి, అమ్రాబాద్‌, మన్ననూరు రేంజ్‌ అధికారులు ఈశ్వర్‌, ఆదిత్య తెలిపారు. రిజర్వు అభయారణ్యం, పులుల అభయారణ్య ప్రాంతాల వారీగా అడవులను విభజించగా, రిజర్వు ఫారె్‌స్టలో నాలుగేళ్లకొకసారి మాత్రమే పులుల గణన జరుగుతుంది.

Updated Date - Mar 01 , 2024 | 03:56 AM

Advertising
Advertising