ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దారి మళ్లిన రూ.1200 కోట్లు

ABN, Publish Date - Mar 03 , 2024 | 04:32 AM

కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రధాన ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే స్టాంప్‌ డ్యూటీ కూడా ఒకటి.

ఏప్రిల్‌ 2019 నుంచి అక్టోబరు 2022 మధ్య మునిసిపాలిటీలకు రావాల్సిన ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ ఇది

ఇతర అవసరాలకు మళ్లించిన గత ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రధాన ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే స్టాంప్‌ డ్యూటీ కూడా ఒకటి. రిజిస్ట్రేషన్‌ శాఖ 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీ వసూలు చేస్తే అందులో మునిసిపాలిటీలకు 1.5 శాతం చెల్లించాలి. ఇలా 2019 ఏప్రిల్‌ నుంచి 2022 అక్టోబరు వరకు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద మునిసిపాలిటీలకు అందాల్సిన రూ.1200 కోట్లను గత ప్రభు త్వం ఇతర అవసరాలకు దారి మళ్లించింది. వాస్తవానికి ఈ మొత్తం నేరుగా ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ కావాలి. దాన్ని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. కానీ దారి మళ్లడంతో మునిసిపాలిటీల్లో చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా వెనుకాడే పరిస్థితి నెలకొంది. చాలా మునిసిపాలిటీలలో ఆక్రమణకు గురవుతున్న స్థలాలకు కనీసం కంచెలు కూడా వేసుకోలేని దుస్థితి ఉంది. రాష్ట్రంలో సుమారు 2,471 స్థలాలు ఉంటే వాటిలో 1,336 స్థలాలకు రక్షణ చర్యలు లేవని పురపాలక శాఖ నివేదికల్లో పేర్కొన్నారు. 2025 నాటికి పట్టణ జనాభా 50 శాతం అవుతుందని గొప్పగా చెప్పిన గత ప్రభుత్వం మునిసిపాలిటీల ఆదాయ వనరులను దారి మళ్లించి కోలుకోలేని దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి. అనేక మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కాగితాలకే పరిమితమైంది.

Updated Date - Mar 03 , 2024 | 07:22 AM

Advertising
Advertising