వెర్‌స్టాపెన్‌దే బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ
ABN, Publish Date - Mar 03 , 2024 | 04:43 AM
ఫార్ములావన్ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ రెడ్‌బుల్ డ్రైవర్ సీజన్ మొదటి ఎఫ్1 రేసు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ చాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ రెడ్‌బుల్ డ్రైవర్ సీజన్ మొదటి ఎఫ్1 రేసు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రేసును వెర్‌స్టాపెన్ అగ్రస్థానంతో ముగించాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్జియో పెరెజ్ రెండు, ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. వరుసగా ఎనిమిదో రేసు నెగ్గిన వెర్‌స్టాపెన్‌కు కెరీర్‌లో ఇది 55వ విజయం.
Updated Date - Mar 03 , 2024 | 04:43 AM