ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రసపట్టులో..

ABN, Publish Date - Mar 06 , 2024 | 06:04 AM

రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌ రసకందాయంగా మారింది. విదర్భ గెలుపునకు నాలుగు వికెట్లు అవసరంకాగా, విజయానికి మధ్యప్రదేశ్‌ (ఎంపీ) 93 పరుగుల దూరంలో ఉంది...

విదర్భ గీఎంపీ రంజీ సెమీస్‌

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్‌ రసకందాయంగా మారింది. విదర్భ గెలుపునకు నాలుగు వికెట్లు అవసరంకాగా, విజయానికి మధ్యప్రదేశ్‌ (ఎంపీ) 93 పరుగుల దూరంలో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 343/6తో ఆటకు నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ 402 పరుగులకు ఆలౌటైంది. యశ్‌ రాథోడ్‌ శతకం (141), కెప్టెన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ హాఫ్‌ సెంచరీ (77)తో రాణించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్‌ అనుభవ్‌ అగర్వాల్‌ ఐదు (5/92) వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 228 పరుగులు చేసింది. ప్రధాన బ్యాటర్లందరూ పెవిలియన్‌కు చేరడంతో ప్రస్తుతం క్రీజులో టెయిలెండర్లు సారాంశ్‌ జైన్‌ (16), కార్తికేయ (0) ఉన్నారు. విదర్భ బౌలింగ్‌ దళాన్ని ఎదుర్కొని మధ్యప్రదేశ్‌ టెయిలెండర్లు విజయాన్ని సాధించడం కష్టమేనని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 170కి, మధ్యప్రదేశ్‌ 252 పరుగులకు ఆలౌటవడం తెలిసిందే.

Updated Date - Mar 06 , 2024 | 06:04 AM

Advertising
Advertising