ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్జున్‌కు డ్రా

ABN, Publish Date - Mar 06 , 2024 | 06:06 AM

షెంగ్జెన్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఐదో రౌండ్‌ను తెలుగు జీఎం ఇరిగేసి అర్జున్‌ డ్రాగా ముగించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది తొలి డ్రా. మంగళవారం...

న్యూఢిల్లీ: షెంగ్జెన్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఐదో రౌండ్‌ను తెలుగు జీఎం ఇరిగేసి అర్జున్‌ డ్రాగా ముగించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్‌కు ఇది తొలి డ్రా. మంగళవారం చైనా జీఎం యు యాంగితో ముగిసిన ఐదో రౌండ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన అర్జున్‌ గత గేమ్‌లతో పోలిస్తే ఒకింత రక్షణాత్మకంగా ఆడాడు. ఆట 25వ ఎత్తు వద్ద ఇరువురు జీఎంలు డ్రాకు అంగీకరించడంతో చెరో అర పాయింట్‌ లభించింది. ఇక, చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న ప్రాగ్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో ప్రజ్ఞానంద మూడో విజయం సాధించాడు. ఆరో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌తో జీఎం అబ్దుసత్తోరోవ్‌ నోడిర్బెక్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు.

Updated Date - Mar 06 , 2024 | 06:06 AM

Advertising
Advertising