ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Holi: హోలీ వేడుకల్లో చూడముచ్చటగా జపాన్ రాయబారి దంపతులు.. వీడియో చూసేయండి

ABN, Publish Date - Mar 25 , 2024 | 03:02 PM

భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ తన భార్య ఐకో సుజుకీతో కలిసి హోలీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వారిరువురు ఒకరికొకరు ఆప్యాయంగా రంగులు పూసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా హోలీ(Holi) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలు ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటిగా భావించే హోలీ శీతాకాలం ముగింపును సూచిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రెండు రోజులపాటు వేడుకలు జరుపుకుంటారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని తమ ఆప్యాయతను చాటుకుంటారు. భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ తన భార్య ఐకో సుజుకీతో కలిసి హోలీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వారిరువురు ఒకరికొకరు ఆప్యాయంగా రంగులు పూసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.


నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. జపాన్ రాయబారి దంపతులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ''సుజుకి శాన్ దంపతులకు హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ మీ జీవితాల్లో మరిన్ని రంగులు నింపాలని కోరుకుంటున్నా’’అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

అంతకుముందు వారిద్దరు ముంబై ఫిల్మ్ సిటీని సందర్శించారు. సదరు చిత్రాలను X లో పంచుకున్నారు. హిరోషి సుజుకీ 2022లో భారత్‌కి వచ్చారు. అప్పట్లో భారతీయ ఆహారాన్ని పొగుడుతూ చేసిన కామెంట్లతో ఫేమస్ అయ్యారు. ఇక.. భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సైతం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 03:05 PM

Advertising
Advertising