ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PDF : స్మాల్‌ పీడీఎఫ్‌

ABN, Publish Date - Feb 03 , 2024 | 05:55 AM

ఈ రోజుల్లో బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ నుంచి పలు డాక్యుమెంట్లను పీడీఎఫ్‌ రూపంలో పంపుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో పీడీఎఫ్‌ ఫైల్స్‌ను ఎడిట్‌,

  • ఈ రోజుల్లో బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ నుంచి పలు డాక్యుమెంట్లను పీడీఎఫ్‌ రూపంలో పంపుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో పీడీఎఫ్‌ ఫైల్స్‌ను ఎడిట్‌, కన్వర్ట్‌ చేసేందుకు ఉపయోగపడే యాప్‌ ఇది. ఇదో ఎఫెక్టివ్‌ పీడీఎఫ్‌ టూల్‌.

  • దీంతో డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్‌ను దీంతో సులువుగా కానిచ్చేయవచ్చు. ఇందులో ఎడిటింగ్‌ యాప్‌ పలు ఫీచర్లను అందిస్తోంది. పీడీఎఫ్‌ల ఫైల్స్‌తో తరచూ పనిచేసే వ్యక్తులకు ఇది చాలా బాగా ఉపయోగపడే యాప్‌ అంటే అతిశయోక్తి కాదు.

  • ఇది పీడీఎఫ్‌ ఫైల్స్‌ను వేర్వేరు ఫార్మాట్స్‌ అంటే మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, పవర్‌పాయింట్‌, ఎక్సెల్‌ ఫైల్స్‌గా మార్చగలదు. అదేవిధంగా వేరేవాటిని పీడీఎఫ్‌ ఫైల్స్‌గా మారుస్తుంది. వేర్వేరు పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక డాక్యుమెంట్‌గా మార్చగలుగుతుంది.

  • టెక్స్ట్‌ నుంచి ఇమేజెస్‌, షేప్స్‌ తదితరాలను చేర్చవచ్చు. ఆఖరుకు డిజిటల్‌ సిగ్నేచర్‌ను సైతం జోడించవచ్చు.

  • డేటా సేఫ్‌గా ఉంటుంది. దీని మేనేజ్‌మెంట్‌ కూడా సులువు. అన్ని డాక్యుమెంట్లు, ఫైల్స్‌ని సురక్షితంగా ఒక ప్లేస్‌లో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్‌ తదితరాలతో భద్రంగా దాచిపెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ల లాకింగ్‌ అదేవిధంగా షేరింగ్‌ సులువు.

  • రొటేట్‌ స్ప్లిట్‌, డిలీట్‌ పేజెస్‌, ఎక్స్‌ట్రాక్ట్‌ పేజెస్‌ తదితర ఎడిటింగ్‌ టూల్స్‌ కూడా పీడీఎఫ్‌లకు సంబంధించి ఇందులో ఉన్నాయి. పీడీఎఫ్‌ సైజ్‌ తగ్గించుకోవచ్చు. కావాల్సిన సైజ్‌కు తెచ్చుకోవచ్చు.

  • ఈ యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ కోసం స్మాల్‌పీడీఎఫ్‌ ప్రొ లేదా నెలవారీ చందా కలిగిన టీమ్స్‌ వెర్షన్‌ను ఎంచుకోవాలి.

Updated Date - Feb 03 , 2024 | 05:55 AM

Advertising
Advertising