ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మీ విలువ గ్రహించండి సహజయోగ

ABN, Publish Date - Mar 08 , 2024 | 05:23 AM

సహజ యోగ ఆవిష్కరణ ద్వారా... భారతీయ యోగ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి. ప్రపంచాన్ని శాంతి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఆమె అహర్నిశలు శ్రమించారు.

హజ యోగ ఆవిష్కరణ ద్వారా... భారతీయ యోగ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి. ప్రపంచాన్ని శాంతి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఆమె అహర్నిశలు శ్రమించారు. ఎంతోమందికి సంపూర్ణమైన భౌతి, మానసిక ఆరోగ్య సాధన కోసం ఉచితంగా సహజయోగాన్ని అందించారు. అలాగే మహిళాభ్యుదయం కోసం, మహిళా సాధికారత కోసం ఆమె ఎంతగానో తపనపడ్డారు. వాటికోసం అహర్నిశలూ కృషి చేశారు. ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర, వారి బాధ్యతల గురించి వివిధ సందర్భాల్లో ప్రసంగాలు చేశారు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, అద్వితీయమైన ప్రసంగం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వాటిలో కొన్ని అంశాలను ప్రస్తావించుకుందాం:

‘‘యావత్‌ ప్రపంచ చరిత్రలోనే ఉత్కృష్టమైన ప్రస్తుత కాలంలో... మహిళా సమస్యల గురించి ఇంత గొప్ప చైతన్యాన్ని నేను ఊహించలేదు. మానవ సమాజంలో మహిళల సముచిత పాత్రను, ప్రాధాన్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల... ఎన్నో సంవత్సరాలుగా స్త్రీ జాతి సమస్తం అనేక బాధలకు గురయింది. మహిళల ద్వారా ఉద్భవించిన సమాజమే మహిళలను అణచివేస్తోంది. వారిపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. ప్రతి దేశానికి లేదా ప్రతి నాగరికతకు అంతర్గత శక్తి మహిళలేననేది వాస్తవం. సమస్త మానవజాతి నిర్మాతలు, సంరక్షకులు స్త్రీలు అనేది నిర్వివాదాంశం. సర్వరక్షకుడైన భగవంతుడు వారికి ఇచ్చిన పాత్ర ఇది. విస్తనాలు వాటంతట అవే దేన్నీ సృష్టించలేవు. ఎంతో ఒత్తిడిని భరిస్తూ మొత్తం లోకం అంతటికీ ఫలపుష్పాలను భూమాత అందిస్తుంది. మహిళ కూడా భూమాత లాంటిదే. శిశువుకు జన్మనిచ్చి, పెంచి, పోషించి, రేపటి పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. మహిళలు తమ శక్తిని తాము గుర్తిస్తే... ఈ ప్రపంచాన్ని అత్యంత సుందరంగా మార్చగలరు. ఒక శక్తిమంతుడైన పురుషుణ్ణి చూసినప్పుడు... అతని వెనుక ఒక స్త్రీ ఉందని మనం గుర్తించవచ్చు. ఆమె కావాలనుకుంటే పురుషులకన్నా ఎక్కువ పని చెయ్యగలదు. అయితే మొదట నమ్రతతో, అణకువతో, హుందాతనంతో, చక్కటి అవగాహనతో, వాత్సల్యపూరితంగా ఉండి... తనలోని శక్తులను గౌరవించుకుంటూ శాంతిని నెలకొల్పడం, కవచంలా రక్షణ కల్పించడం మహిళల బాధ్యత.

ప్రస్తుతం మన సమాజాన్ని లంచగొండితనం, హింస అనే భూతాలు పీడిస్తున్నాయి. ఈ జాడ్యాలు తలెత్తకుండా... బాల్యంలోనే పిల్లల నడవడికను సరిదిద్ది, పిల్లలను సన్మార్గంలో పెట్టడం తమ బాధ్యత అని మహిళలు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత కాలంలో కొందరు మహిళలను విలువలను, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పోగొట్టుకుంటున్నారు. పోటీతత్వం, ధనాశ, విజయం సాధించడం మీదే ధ్యాస లాంటి నిరర్థకమైన విషయాల్లో ఆసక్తి పెరిగింది. ఆధ్యాత్మిక ఎదుగుదల మీద శ్రద్ద లోపిస్తోంది. మహిళకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలుంటారన్నారు పూర్వులు. అయితే అలా గౌరవం పొందే స్థాయిలో మహిళలు ఉండాలి. తాళాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ విలువను మీరు అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు లోకువ చేసుకోకుండా, చౌకబారు పేరు ప్రతిష్టలకు పాకులాడకుండా... నిబద్ధతతో ఉంటే, సునాయాసంగా సమస్యలను పరిష్కరించగలరు. మొత్తం ప్రపంచాన్ని మీ స్వాధీనంలోకి తెచ్చుకోగలరు. అప్పుడు సమస్త మానవాళికీ సంపూర్ణ రక్షణ కలుగుతుంది. మరి ఆ సమతుల్యమైన స్థితిని ఎలా సాధించాలి? రోగాలు, అవినీతి, లంచగొండితనం, నైతిక పతనం, అజ్ఞానం అనే ఈ కెరటాలకు మనం ఏ విధంగా అడ్డుకట్ట వేయగలం? ప్రస్తుత సంఘర్షణను, గందరగోళ పరిస్థితిని ఏ విధంగా అంతం చెయ్యగలం? ప్రతివారి హృదయంలో, మనస్సులో శాంతిని ఏ విధంగా స్థాపించగలం? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమైన మార్గం సహజయోగ. మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసుకొని, సర్వవ్యాపక శక్తి అయిన పరమాత్ముని ప్రేమ శక్తితో మనల్ని అనుసంధానించుకోవాలి. అప్పుడు ఆ దివ్యశక్తి మీలో ప్రవహించి, మిమ్మల్ని ఉత్సాహవంతుల్ని చేస్తుంది. మీరు అత్యంత శక్తిమంతులుగా, శాంతిస్వరూపులుగా మారుతారు. మీ వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుంది’’ అని శ్రీ మాతాజీ వెల్లడించారు.

తాను చెప్పిన వాటిని ఆమె స్వయంగా పాటించి, నిరూపించి... సహజయోగ మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నిస్సహాయులైన మహిళలు, బాలికల సంరక్షణే ధ్యేయంగా ఢిల్లీలో విశ్వ నిర్మల ప్రేమ ఆశ్రమాన్ని ప్రారంభించారు. రేపటి సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను స్వతంత్రంగా ఎదుర్కొని... ఆనందమయమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా మహిళలు తయారు కావాలన్నదే శ్రీమాతాజీ ఆశయం.

Updated Date - Mar 08 , 2024 | 05:23 AM

Advertising
Advertising