ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Horoscope: ఈ రాశివారికి గుడ్ న్యూస్..

ABN, Publish Date - Mar 01 , 2024 | 07:43 AM

నేడు (1-3-2024 శుక్రవారం) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

నేడు (1-3-2024 శుక్రవారం)వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, పన్నులు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. పెన్షన్‌, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు లభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొత్త పనుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. గౌరవపదవులు అందుకుంటారు. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, న్యాయ, రక్షణ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల సహకారంతో పదవులు అందుకుంటారు. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. అద్దె నిర్ణయాలకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రియతములతో వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రాజకీయనేతలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణ అంశాలపై చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వారసత్వ విషయాలు, కోర్టు వ్యవహారాలు చర్చకు వస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరుతారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గౌరవ మన్ననలు అందుకుంటారు. చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. యూనియన్‌ వ్యవహారాలు, ప్రదర్శనలకు అనుకూలం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. అమ్మవారి ఆలయదర్శనం శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారికి విజయం లభిస్తుంది. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్‌ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వాహన యోగం కలుగుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Mar 01 , 2024 | 07:46 AM

Advertising
Advertising