బెర్లిన్‌లో ‘ది ఫాబల్’కు అద్భుత స్పందన
ABN, Publish Date - Feb 18 , 2024 | 05:06 AM
మనోజ్ వాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించిన ‘ది ఫాబల్’ చిత్రాన్ని బెర్లిన్‌లో జరుగుతున్న 74 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శుక్రవారం
మనోజ్ వాజ్‌పేయి ప్రధాన పాత్ర పోషించిన ‘ది ఫాబల్’ చిత్రాన్ని బెర్లిన్‌లో జరుగుతున్న 74 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శుక్రవారం ప్రదర్శించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చిందని దర్శకుడు రామ్‌రెడ్డి చెప్పారు. 16 ఎం.ఎం. ఫార్మెట్‌లో ఉత్తరాఖండ్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బెర్లిన్‌లో జరిగిన ఫెస్టివల్‌లో మా చిత్ర ప్రదర్శనకు వచ్చిన స్పందన అద్భుతం. తొలి ప్రదర్శన టికెట్లు గంటలోనే అమ్ముడవగా, రెండో రోజు కూడా దాదాపు వెయ్యి టికెట్లు అమ్ముడవడం చాలా ఆనందాన్ని కలిగించింది. మా కష్టానికి తగిన ప్రతిపలం లభించింది’ అని మీడియాకు చెప్పారు రామ్‌రెడ్డి. ఆయనకు ‘ది ఫాబల్’ రెండో సినిమా. మొదటి చిత్రం ‘తితి’ కూడా జాతీయ అవార్డ్ సాదించడమే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది.
Updated Date - Feb 18 , 2024 | 05:06 AM