ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Actress Malaika Arora : నేనొక ఎమోషనల్‌ ఫైటర్‌ని

ABN, Publish Date - Feb 03 , 2024 | 11:57 PM

బాలీవుడ్‌లో ‘ఛయ్య.. ఛయ్య..’ పాటతో పాపులర్‌ అయిన నటి మలైకా అరోరా. టెలివిజన్‌ వ్యాఖ్యాత, నటి, నిర్మాత అయిన మలైకా అనగానే గుర్తొచ్చేది ఐటం సాంగ్సే. ఆమె కెరీర్‌తో పాటు మరిన్ని జీవిత విశేషాలు ఇవిగో... మలైకా అరోరా వయసు యాభై ఏళ్లు. ఆమె మాత్రం కుర్రహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా హల్చల్‌ చేస్తుంది.

బాలీవుడ్‌లో ‘ఛయ్య.. ఛయ్య..’ పాటతో పాపులర్‌ అయిన నటి మలైకా అరోరా. టెలివిజన్‌ వ్యాఖ్యాత, నటి, నిర్మాత అయిన మలైకా అనగానే గుర్తొచ్చేది ఐటం సాంగ్సే. ఆమె కెరీర్‌తో పాటు మరిన్ని జీవిత విశేషాలు ఇవిగో... మలైకా అరోరా వయసు యాభై ఏళ్లు. ఆమె మాత్రం కుర్రహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా హల్చల్‌ చేస్తుంది. ఆన్‌స్ర్కీన్‌ మీదనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ గ్లామర్‌లుక్‌లో కనపడుతోంటోందీ బ్యూటీ. కోటి ఎనభై లక్షల మంది నెటిజన్లు ఈ మున్నీని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్‌ బావుందని అర్థం.

అలాంటివేమీ పట్టించుకోను...

తొంభయ్యిల్లో బాలీవుడ్‌ ఐటమ్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన మలైకా అరోరాకు అదే ఫ్రేమ్‌ కంటిన్యూ అవుతోంది. తన భర్త అర్బాజ్‌ఖాన్‌తో విడిపోయాక.. ఆమె ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌తో లవ్‌లో ఉంది. ‘ఎవరేమనుకున్నా పట్టించుకోను. ఐటమ్‌ బాంబ్‌.. లాంటి ఎలాంటి ట్యాగ్స్‌ వేసినా పట్టించుకోను. నేనో పాసివ్‌ అగ్రెసివ్‌ పర్సన్‌ను. ఎమోషనల్‌ ఫైటర్‌ను. దేన్నీ పట్టించుకోను. అర్జున్‌ విషయంలో వయసులో చిన్నవాడని.. అంటారు. అర్జున్‌ నాకు అసలైన భాగస్వామి. అతనో ప్యూర్‌ సోల్‌. అందుకే అతన్ని ప్రేమిస్తాను. నా గురించి నా కొడుక్కి కూడా తెలుసు. రిలేషన్‌షిప్స్‌ దాచిపెట్టాలనుకోను. జనాల ఆలోచనల్లో మలైకా అంటే.. ‘గుడ్‌ ఫేస్‌’, ‘బెస్ట్‌ బాడీ’ అనిపించుకోవాలంతే. అందుకోసం ప్రయత్నిస్తాను. అందుకే జిమ్‌, కసరత్తులు. మళ్లీ నేనేంటో ప్రూవ్‌ చేసుకుంటా. అలాంటి రోజు త్వరలో వస్తుందని అనుకుంటున్నాను’ అంటుంది మలైకా అరోరా.

అలా ఇండస్ట్రీలోకి...

స్వాహిలీ భాషలో మలైకా అంటే అర్థం.. ‘ఏంజెల్‌’. చిన్నతనంలోనే తన పేరెంట్స్‌ విడిపోవటంతో తన అమ్మతో ఉండిపోయింది. తన చెల్లి పేరు అమృతా అరోరా. పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో. చెంబూర్‌లో డిగ్రీ చదివేప్పుడే మోడలింగ్‌ కెరీర్‌ వైపు వచ్చింది. ఎమ్‌టీవీలో వీజేగా పని చేసింది. మోడలింగ్‌తో పాటు యాడ్స్‌లోనూ నటించింది. అలా ఆమెకు ‘దిల్‌సే’ (1998)లో తొలిసారి ఐటంసాంగ్‌లో ఆడిపాడే అవకాశం వచ్చింది. ఛయ్య.. ఛయ్య.. పాట పాపులర్‌ అవటంతో ఆమె క్రేజ్‌ పెరిగింది. ఆమె అనుకోకుండా స్పెషల్‌ సాంగ్స్‌కే పరిమితం అయ్యేలా చేశారు దర్శకులు. తెలుగులో కూడా ‘అతిథి’, ‘గబ్బర్‌సింగ్‌’లో ఐటమ్‌సాంగ్స్‌లో చిందులేసింది. అవార్డు ఫంక్షన్లలో, రియాలిటీ షోల్లో, డ్యాన్‌ ప్రోగ్రాములో ఇప్పటికీ ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. స్మాల్‌ స్ర్కీన్‌ అంటే ఎప్పటికీ ఇష్టమే అంటుందామె.

అలా ఉండటానికి ఇష్టపడతా...

‘పెళ్లయి.. పిల్లలు అయినంత మాత్రాన కెరీర్‌ పోగొట్టుకోవాలనే నిబంధన లేదు. ఇప్పటికీ ట్రాక్‌ ప్యాంట్స్‌, జీన్స్‌లోనే కనిపిస్తా. అలా చిల్‌గా ఉండటానికే ఆసక్తి చూపుతా. అందమైన దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌ మీద వాక్‌ చేయటం ఇష్టం. ఆ సమయంలో నన్ను నేను మర్చిపోతా. విల్‌పవర్‌ ఎక్కువే. ఆత్మవిశ్వాసంతో ఉంటా. జిమ్‌లో హార్డ్‌ వర్కవుట్స్‌ చేస్తా. యోగా సాధన చేస్తా. వీటితో పాటు ముఖ్యంగా మంచి ఆహారం తింటా. హెల్తీ లైఫ్‌ స్టయిల్‌ పాటిస్తా. ఏ జడ్జిమెంట్స్‌ పట్టించుకోను. జీవితం ఇలానే ఉండాలనే లేదు కాబట్టి మూవ్‌ అయ్యాను. జీవితం మీద ఎన్నో ఆలోచనలున్నాయి. ఇంకా ముప్ఫయ్యేళ్లు ఇలానే ఫిట్‌గా ఉండాలనుకునే మనిషిని. సినిమా, బిజినెస్‌, ప్రయాణాలు, స్నేహితులతో ఇపుడయితే హాయిగా జీవితం గడిచిపోతోంది. ఇప్పుడు మంచి స్థితిలోనే ఉన్నా’.

Updated Date - Feb 03 , 2024 | 11:57 PM

Advertising
Advertising