ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ABN, Publish Date - Feb 14 , 2024 | 04:38 PM

డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది.

Dragon Fruit

ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఉండే ఆహారాలను ఎంచుకుని తీసుకోవాలి. ఆరోగ్యాన్ని అందించే ఆహారం అనగానే అందులో ముఖ్యంగా పండ్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ మరీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిలోని ఆరోగ్య లక్షణాలు చాలావరకూ ఎన్నో పోషకాలను కలిగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన మిటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి ముఖ్యమైనవి.

ఫైబర్ అధికంగా ఉంటుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగుల క్రమబద్ధతను ప్రాత్సహిస్తుంది. ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఆరోగ్య అలవాట్లు...!


యాంటీఆక్సిడెంట్ గుణాలు..

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

హైడ్రేషన్..

అధిక నీటి కంటెంట్ తో, డ్రాగన్ ఫ్రూట్ హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహకరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. శరీర ఉష్టోగ్రతను నియంత్రిస్తుంది.

కేలరీలు తక్కువగా ..

డ్రాగన్ ఫ్రూట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.

కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని..

డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి.

ఆరోగ్యకరమైన చర్మం..

డ్రాగన్ ఫ్రూట్ లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మ స్థితిని కాపాడతాయి.


గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 14 , 2024 | 04:38 PM

Advertising
Advertising