నదీగర్భంలో తొలి మెట్రో మార్గం
ABN, Publish Date - Mar 03 , 2024 | 05:11 AM
దేశంలోనే తొలిసారి నదీగర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ఈ నెల ఆరోతేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అతి లోతైన నదిగా పేరు తెచ్చుకున్న కోల్‌కతాలోని హుగ్లీ నదీ గర్భంలో ఈ మార్గం ఏర్పాటుచేశారు. నదీమట్టానికి 32 అడుగులు లోతున, 520 మీటర్ల
కోల్‌కతాలోని హుగ్లీ నది అడుగున నిర్మాణం
ఈ నెల 6న ప్రారంభించనున్న మోదీ
కోల్‌కతా, మార్చి 2: దేశంలోనే తొలిసారి నదీగర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ఈ నెల ఆరోతేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అతి లోతైన నదిగా పేరు తెచ్చుకున్న కోల్‌కతాలోని హుగ్లీ నదీ గర్భంలో ఈ మార్గం ఏర్పాటుచేశారు. నదీమట్టానికి 32 అడుగులు లోతున, 520 మీటర్ల పొడవునా ఈ నిర్మాణం జరిగింది. హుగ్లీ తూర్పు, పశ్చిమ తీరాల్లో మహాకరణ్, హవ్‌డా రైల్వే స్టేషన్లు నిర్మించారు. ఈ రెండు స్టేషన్లను మెట్రో మార్గం అనుసంధానిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణన్ తెలిపారు. మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే కోల్‌కతాలో టేగోరియా స్టేషన్ నుంచి హుగ్లీ నది అవతలి తీరంలోని హడ్‌వా వరకు సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే.. ప్రయాణ దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతాలోని గ్రీన్‌లైన్ తూర్పు కోల్‌కతాలోని సెక్టార్ వీ నుంచి పూల్‌బగాన్ వరకు 6.97 కిలోమీటర్ల దూరం పరుచుకొని ఉంది. మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే, సెక్టార్ వీ నుంచి హౌరా వరకు అది విస్తరించి.. 27 నిమిషాల్లోనే ఆ దూరాన్ని అధిగమించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. కాగా, దాదాపు వెయ్యి అమృత్ భారత్ రైళ్లను రానున్న సంవత్సరాల్లో తయారుచేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించేలా వాటిని సిద్ధంచేస్తున్నాట్టు చెప్పారు.
Updated Date - Mar 03 , 2024 | 05:11 AM