కేసుల విచారణపై గడువు విధించలేం
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:51 AM
మధ్యంతర స్టే ఉత్తర్వుల విషయమై గతం లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ గురువారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఇచ్చే మధ్యంతర
6 నెలలు గడిచినంత మాత్రాన ‘స్టే’ ఆటోమేటిక్‌గా రద్దు కాదు: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: మధ్యంతర స్టే ఉత్తర్వుల విషయమై గతం లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ గురువారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఇచ్చే మధ్యంతర స్టే ఉత్తర్వులు ఆరు నెలల అనంతరం ఆటోమేటిక్‌గా రద్దేమీ కావని స్పష్టంచేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయిస్తే ఫలానా సమయంలోగా కేసులు పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టుగానీ, హైకోర్టుగానీ ట్రయల్ కోర్టులకు ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేవని తెలిపింది. కేసులోని అంశాల ఆధారంగా అవే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై 2018లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ తాజా నిర్ణయం వెలువరించింది. ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎ్‌స.ఓకా, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఒకే అభిప్రాయాన్ని పేర్కొంటూనే జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఓకా విడివిడిగా తీర్పులు రాశారు. జస్టిస్ మిశ్ర వ్యక్తిగతంగా, జస్టిస్ ఓకా తనతోపాటు మిగిలిన ముగ్గురితరఫున తీర్పు రాశారు. ఆసియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజె న్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసుపై 2018లో త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇస్తూ ప్రత్యేకంగా పొడిగించకపోతే ట్రయల్ కోర్టుల్లో జరిగే విచారణలపై వచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయని తెలిపింది.
Updated Date - Mar 01 , 2024 | 07:48 AM