గుప్త నిధుల అడ్డా ఎన్నికల బాండ్లు
ABN, Publish Date - Mar 08 , 2024 | 03:51 AM
జాతీయ పార్టీలకు గుప్త మార్గా ల్లో అందిన నిధుల్లో 82.42% ఎన్నికల బాండ్ల రూపంలోనే లభించాయని స్వతంత్ర ప్రజాస్వామ్య వేదిక ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్
జాతీయపార్టీలకు గుప్త మార్గాల్లో రూ.1,832 కోట్లు
2022-23లో పార్టీలు అందిన విరాళాల ఆధారంగా నివేదిక విడుదల చేసిన ఏడీఆర్
న్యూఢిల్లీ, మార్చి 7: జాతీయ పార్టీలకు గుప్త మార్గా ల్లో అందిన నిధుల్లో 82.42% ఎన్నికల బాండ్ల రూపంలోనే లభించాయని స్వతంత్ర ప్రజాస్వామ్య వేదిక ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) తెలిపింది. 2022-23 సంవత్సరానికి జాతీయ పార్టీలు ఈసీకి సమర్పించిన విరాళాల జాబితా, ఆడిట్ నివేదికలను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందని వివరించింది. ఆ ఏడాది ఈ పార్టీలకు అందిన విరాళాల్లో మొత్తం రూ.1,832.88 కోట్లు గుప్త మార్గంలో అందగా, అందులో రూ.1,510 కోట్లు ఎన్నిల బాండ్ల రూపంలో లభించాయని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీల (ఎన్‌పీపీ) ఆడిట్, ఇతర ఆర్థిక వివరాలపై సేకరించిన సమాచారం ఆధారంగా ఏడీఆర్ తన నివేదికను తయారుచేసింది. దీనిని అనుసరించి.. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు అందుకు న్న పార్టీల్లో బీజేపీ ముందు వరుసలో ఉంది. 2022-23లో జాతీయ పార్టీలు ఆర్జించిన మొత్తం ఆదాయంలో బీజేపీ కి రూ.1,400 కోట్లు (76.39ు) ఈ రూపంలోనే లభించాయని తెలిపింది. ఇక.. కాంగ్రె్‌సకు రూ.315.11 కోట్లు (17.19ు) లభించాయని ఏడీఆర్ పేర్కొంది. వలంటరీ కంట్రిబ్యూషన్లు/కూపన్ల అమ్మకం/ఎన్నికల బాండ్లు, గుప్త మార్గాల్లో తమకు రూపాయి కూడా అందలేదని బీఎస్పీ ప్రకటించిందని వెల్లడించింది. అయితే, బ్యాంకు వడ్డీ, సభ్యత్వ రుసుం, స్థిరాస్తి అమ్మకాలు తదితర మార్గాల్లో బీఎస్పీకి రూ.29.27 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొంది. కూపన్ల అమ్మకం ద్వారా తమకు రూ. 136.79 కోట్లు లభించాయని కాంగ్రెస్, సీపీఎం తెలిపాయని పేర్కొంది. ఎన్నికల బాండ్ల వినియోగంలో జాతీయ పార్టీల ప్రస్తావన ప్రముఖంగా కనిపించినా, ప్రాంతీయ పార్టీలూ గణనీయమైన స్థాయిలోనే ఈ నిధులను పొందుతున్నాయని ఏడీఆర్ వెల్లడించింది.
Updated Date - Mar 08 , 2024 | 07:32 AM