మరోసారి రాజ్యసభకు జయాబచ్చన్!
ABN, Publish Date - Feb 14 , 2024 | 04:23 AM
ఉత్తరప్రదేశ్ నుంచి జయాబచ్చన్‌ను సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. అలాగే మాజీ ఎంపీ రామ్‌జీలాల్ సుమన్,
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఉత్తరప్రదేశ్ నుంచి జయాబచ్చన్‌ను సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. అలాగే మాజీ ఎంపీ రామ్‌జీలాల్ సుమన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్..లను తమ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించింది. పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్, పలువురి సమక్షంలో వీరు మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జయాబచ్చన్ ఇప్పటికే నాలుగు సార్లు ఎగువసభకు ఎన్నికయ్యారు. తాజాగా అయిదోసారి ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరోవైపు బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝాను బిహార్ నుంచి పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా జేడీ(యూ) ప్రకటించింది.
Updated Date - Feb 14 , 2024 | 07:23 AM