ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ‘టీజీ’
ABN, Publish Date - Mar 13 , 2024 | 03:59 AM
మోటారు వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను మారుస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక..
గెజిట్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ
టీఎస్‌ను మార్చాలంటూ రేవంత్ సర్కారు విజ్ఞప్తి
సత్వరమే స్పందించి, ఆమోదం తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 12: మోటారు వాహనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను మారుస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక.. ప్రస్తుతం ఉన్న ‘టీఎస్’ కోడ్‌ను ‘టీజీ’గా మార్చాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం.. ఆ మేరకు ఆమోదం తెలుపుతూ.. గెజిట్‌ను జారీ చేసింది. నిజానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత.. అంటే జూన్ 2, 2014 నుంచి ‘టీజీ’ కోడ్ అమల్లోకి వచ్చింది. కేసీఆర్ సర్కారు దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ స్టేట్(టీఎ్‌స)కు ఆమోదం తెలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ కోడ్ వచ్చేదాకా రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అలా.. దాదాపు 10 రోజుల పాటు రవాణాశాఖ వాహన రిజిస్ట్రేషన్ల జోలికి వెళ్లలేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ‘టీజీ’ కోడ్ డిమాండ్ ఉండేది. అప్పట్లో దేవేందర్ గౌడ్ స్థాపించిన నవతెలంగాణ పార్టీ తరఫున హైవేల్లో వాహనాలను నిలిపి.. ‘ఏపీ’ అని ఉన్న రిజిస్ట్రేషన్ ప్లేట్లకు ‘టీజీ’ని అతికించారు. అయితే.. కేసీఆర్ సర్కారు మాత్రం టీఎస్ వైపే మొగ్గుచూపింది. అంతేకాదు.. పత్రికల్లో కూడా రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో తెలంగాణకు బదులుగా ‘టీజీ’ అనే పొడి అక్షరాలను వినియోగించడంపైనా కూడా కేసీఆర్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీజీ’ కాకుండా.. ‘టీఎ్‌స’ను వాడాలని కోరుతూ పత్రికలు, ఎలకా్ట్రనిక్ మీడియాకు సీఎస్ ద్వారా లేఖలు పంపింది.
Updated Date - Mar 13 , 2024 | 08:52 AM