ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ అడ్రస్‌ మారింది!

ABN, Publish Date - Mar 03 , 2024 | 05:02 AM

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌(ప్రధాన కార్యాచరణ వేదిక) మారింది. దాదాపు 18 ఏళ్లుగా సెంట్రల్‌ ఢిల్లీలో కొనసాగిన ఈ కార్యాలయం ఖాన్‌ మార్కెట్‌ పక్కనే ఉన్న

న్యూఢిల్లీ, మార్చి 2: ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌(ప్రధాన కార్యాచరణ వేదిక) మారింది. దాదాపు 18 ఏళ్లుగా సెంట్రల్‌ ఢిల్లీలో కొనసాగిన ఈ కార్యాలయం ఖాన్‌ మార్కెట్‌ పక్కనే ఉన్న భవంతిలోకి మారింది. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసుకున్న వార్‌రూమ్‌ సెంట్రల్‌ ఢిల్లీలోని 99 సౌత్‌ అవెన్యూలో సుదీర్ఘకాలం కొనసాగింది. 99 సౌత్‌ అవెన్యూలో నివాసం ఉంటున్న రాజ్యసభ సభ్యుడు ప్రదీప్‌ భట్టాచార్య పదవీకాలం గత ఏడాది ఆగస్టులో పూర్తైంది. దీంతో కొత్త వార్‌రూమ్‌ను కాంగ్రెస్‌ ఏర్పాటుచేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖాన్‌ మార్కెట్‌ ప్రాంతంలోని సుబ్రహ్మణ్య భారతి మార్గ్‌లోని సీ 1/10 భవంతిలోకి తాజాగా మార్చారు. ఇది ప్రస్తుత తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేరు మీద ఉంది. ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు ఈ బంగ్లాను కేటాయించారు. మాజీ ఎంపీలు తమకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయడానికి కొంత సమయం ఇస్తారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికలు అయ్యేవరకు ఈ బంగ్లాలో వార్‌రూమ్‌ నడిపించే అవకాశం ఉంది.

Updated Date - Mar 03 , 2024 | 06:39 AM

Advertising
Advertising